గత కొంతకాలంగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ థీంతో స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ వైరల్ అవుతూనే ఉన్నాయి అలాగే తమ ఫేవరెట్ స్టార్ సెలబ్రిటీల ఫోటోలను చూడడానికి అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వారికి నచ్చిన సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయాన్ని తెలుసుకోవాలని అరటపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ చైల్డ్‌హుడ్ ఫోటో వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నదాన్ని గుర్తుపట్టారా. తన తండ్రి తో పాటు టేబుల్ పై కూర్చొని అమాయకంగా చూస్తున్న ఈ బుడ్డిది.. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ బ్యూటీ. దేశమే మెచ్చిన ఈ అమ్మడు.. తెలుగు, హిందీ తో పాటు తమిళ్లోను ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోతో నిశ్చితార్థ వేడుకలు ఇటీవల జరుపుకుంది. త్వరలోనే వీళ్ళ వివాహం కూడా చేసుకోనున్నారు. ఇప్పటికే ఈ హీట్‌తో ఆమె ఎవరో అర్థమైపోయి ఉండాలి. తనే హీరోయిన్ శోభిత దూళిపాళ్ల. గ్రాడ్యుయేషన్లు పూర్తిచేసి మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శోభిత.. తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫెమీనా మిస్ ఇండియా 2013లో పాల్గొని ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ అవార్డును గెలుచుకుంది. ఇక 2023 పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యత వహించేందుకు శోభిత వెళ్లారు. 2016లో అనురాగ కాస్యప్ డైరెక్షన్‌లో తెరకెక్కిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ రామన్ రాఘవ్ 2.0 తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శోభిత.. ఇందులో నవాజుద్దీన్ సిద్ధికి, విక్కీ కౌశల్‌తో స్క్రీన్ ను పంచుకుంది.
హిందీలో కెరీర్ ప్రారంభించి సౌత్ ఇండియా పై దృష్టి సారించింది. తెలుగు, తమిళ, మలయాళం లోను నటించింది. తమిళ్‌లో మణిరత్న డైరెక్షన్‌లో వచ్చిన పొన్నియన్‌తో అమ్మడికి మంచి బ్రేక్ వచ్చింది. సిపనిమాలతో పాటు.. వెబ్ సిరీస్‌లోను నటిస్తున్న శోభిత.. మేడిన్ హీవెన్ సిరీస్‌తో తనకంటూ ప్రశంసలు దక్కించుకుంది. బాలీవుడ్‌లో ఎంత మంది స్టార్ హీరోలతో జత కట్టిన శోభిత.. దుల్కర్ సల్మాన్ సరసన గురుబ్ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించింది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవల టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో శోభిత ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే అక్కినేని ఇంటి కోడలుగా అమ్మడు అడుగు పెట్టనుంది.