టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ కుర్రాడిగా ఉన్నప్పుడే ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. పెదనాన్న కృష్ణంరాజు బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్.. మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ క్రమంలో సరైన హిట్ కావాలని ఎదురు చూస్తున్న ప్రభాస్ కు పర్ఫెక్ట్ కాంబినేషన్ కుదిరింది. ఎంఎస్ రాజు ప్రొడ్యూసర్ గా శోభన్ బాబు దర్శకత్వంలో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించే సినిమాలో ఛాన్స్ కొట్టేసాడు.
ఆ సినిమా మరేదో కాదు వర్షం. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఓ మంచి లవ్ అండ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మ్యూజికల్ పరంగా మంచి సంచలనం క్రియేట్ చేసింది. అప్పట్లో వర్షం మూవీ సాంగ్స్ మానియా విపరీతంగా ఉండేది. ఇప్పటికీ ఈ సినిమాలో సాంగ్స్ ప్రేక్షకులు వింటూనే ఉన్నారు. కాగా ఈ సినిమా 2004 సంక్రాంతి బరిలో జనవరి 14న రిలీజ్ అయింది. ఇక ఇటీవల బాలయ్య ఆన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్న ప్రభాస్ దీని గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.
ఎంఎస్ రాజు గారు సంక్రాంతికి మూవీ రిలీజ్ చేయాలన్నారు. అప్పటికే మీరు నటించిన లక్ష్మీనరసింహ, చిరంజీవి గారు అంజి సినిమాలు రెండు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. దీంతో నేను ఆయనతో చిరు, బాలయ్య మధ్యలో మన సినిమా అవసరమా సార్.. వద్దులే తర్వాత చూసుకుందాం అన్నా. లేదు రిలీజ్ చేయాల్సిందే అని ఆయన అన్నారు అంటూ వివరించాడు. వెంటనే బాలయ్య మీరు రాజులు కదా.. మాట వినరు అంటూ సరదాగా సెటైర్ వేశారు. దీంతో ప్రభాస్ నవ్వుకున్నాడు. మొత్తానికి వర్షం సినిమా రిలీజై కుంభ స్థలని బద్దలు కొట్టిందని బాలయ్య ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక తనకు ఫస్ట్ సక్సెస్ ఇచ్చిన వర్షం సినిమా గురించి ప్రభాస్ చేసిన కామెంట్స్ నెటింట ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.