దేవర సినిమా థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ టాక్ రాకున్న భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ మూవీ ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుధ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఓవరాల్ గా చూస్తే సగటు ప్రేక్షకుడు ఎంటర్టైన్ అవడం ఖాయం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే చివర్లో వచ్చే ట్విస్ట్ బాహుబలిని గుర్తు చేసిందని చాలామంది చెప్తున్నారు. ఈ మూవీలో సీన్లు గతంలో వచ్చిన పలు సినిమాల్లో సన్నివేశాలను పోలినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో దేవర స్టోరీ మొత్తం చెప్పేసారు. ఇక సీక్వెల్ లో ఏం కథ ఉంటుంది అంటూ పలు సందేహాలు ఆడియన్స్ లో మొదలయ్యాయి. సరిగ్గా చూస్తే సినిమాలో బోలెడన్ని ప్రశ్నలు ఉన్నాయి.
ఒకటి రెండు కాదు ఏకంగా 6,7ప్రశ్నలు ఉంటాయి. అవి ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఇది సినిమా చూసిన వారికి ఇది క్లియర్ గా తెలుస్తాయి. ఇంతకీ ఆ ట్విస్ట్ లో ఏంటంటే..? సినిమా ప్రారంభంలో.. ప్రభుత్వ పెద్దలు చెప్పే యతి, దయ ఈ ఇద్దరు ఎవరు..? ఎర్ర సముద్రం వాళ్లతో స్మగ్లింగ్ చేయించుకున్న మురుగన్ చనిపోయాడు.. అతను ఎలా..? చనిపోయాడో రివిల్ చేయలేదు, మురుగన్ తో పాటు ఉండే డిఎస్పి తులసికి ముఖం, ఒంటిపై ఆ దెబ్బలు ఎలా..? వచ్చాయో ఇందులో రివిల్ చేయలేదు. ఇక నీటి లోపల వార్ సన్నివేశాలలో ఎన్నో అస్తిపంజరాలు చూస్తాం. ఆ ఆస్తిపంజరాలు ఎవరివి..? ఎంత మత్తులో ఉన్నా.. దేవర వచ్చిన శత్రువులను మట్టి పెడతాడు. అలాంటి దేవరని చంపేసింది ఎవరు..? అసలు ఎందుకు..? చంపారు. దేవర ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోయాడని ఇంటర్వెల్లో చూపిస్తారు.
కానీ అప్పటికే తను చనిపోయాడు. ఇక సెకండ్ హాఫ్ లో సముద్రంలోకి వెళ్లిన బైరా మనుషులు కూడా చనిపోయారు. అప్పటికి ద్వారా ఇంకా చిన్నపిల్లడే.. మరి అక్కడ బైరా మనుషుల్ని చంపేసింది ఎవరు..? ఇంతకీ దేవర కథ మొత్తం వినిపించిన ప్రకాష్ రాజ్ ఎవరు…? ప్రకాష్ రాజ్ చెప్పిన ఆ కథ మొత్తం నిజమేనా..? జాన్విని వర పెళ్లి చేసుకుంటాడా..? సీక్వెల్లోనూ తన పాత్ర ఇలానే ఉంటుందా..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలే రెండో పార్ట్‌లో స్టోరీ గా చూపిస్తారు అంటూ సమాచారం. ఇక ఎన్టీఆర్ లైన్లో చూస్తే ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్‌తో సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. వీటి తర్వాత దేవర ఉంటుందని టాక్. ఇక ఇప్పటికే కొరటాల కాస్టింగ్ అంత తమ పనుల అయ్యి.. దేవర పార్ట్ 2 కి సెట్స్‌కు హాజరవ్వడానికి సమయం పడుతుంది. ఈలోపు నేనే ఒక సినిమా తీసేయొచ్చు అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేవర పార్ట్ 2 కి ఎంత సమయం పడుతుందో.. ఎప్పటికీ ఆడియన్స్ ముందుకు వస్తుందో వేచి చూడాలి.