కోలీవుడ్ స్టార్ నటుడు శింబుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలనటుడుగా ఇండస్ట్రీలోకి పరిచయమైన శింబు.. సీనియర్ దర్శక, నటుడు, నిర్మాత.. డి. రాజేందర్ వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక శింబు జీవితంలో ఇప్పటికే ఎన్నో షాకింగ్ ఇన్సిడెంట్స్ జరిగాయి అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే సంచలన నటుడిగా శింబు ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. కేవలం నటనతోనే కాదు.. దర్శకుడుగా, గాయకుడిగా, రచయితగా, సంగీత దర్శకుడుగా ఇలా ప్రతి విషయంలోనూ నటనతో తన సత్తా చాటుకుని మల్టీ టాలెంటెడ్ స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
ఇక ప్రస్తుతం స్టార్ హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న శింబు.. మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న థగ్‌లైఫ్ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. కాగా కమల్ హాసన్ ప్రొడ్యూసర్‌గా రాజ్ కుమార్ పెరియార్ స్వామి దర్శకత్వం వహిస్తున్న మరో సినిమాలోని శింబు చాలా కాలం తర్వాత డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఇది ఆయన నటించే 48వ సినిమా కావడం విశేషం. దీని తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నా శింబు 41 ఏళ్లయినా ఇప్పటికీ వివాహం చేసుకోలేదు.
మొదట్లో హీరోయిన్ నయన్‌తో ప్రేమలో మునిగి తేలిన ఈయన.. ఆమెతో బ్రేకప్ తర్వాత హన్సికతో ప్రేమాయనం నడిపాడు. ఇక ఇటీవల శింబు తండ్రి టీ. రాజేందర్ తన కొడుకుది ప్రేమ వివాహమే అవుతుందంటూ బహిరంగంగా వివరించాడు. ఈ క్రమంలో శింబు పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. నటి నిధి అగర్వాల్ తో ఎఫైర్ ఉందంటూ.. వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. 2021లో శింబు హీరోగా తెరకెక్కిన ఈశ్వరన్ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. అప్పటినుంచి డేటింగ్ లో ఉన్న ఈ ఇద్దరు.. తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించారని.. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు టాక్ నడుస్తుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటివరకు వెలువడలేదు.