బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌కు టాలీవుడ్‌లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల రిలీజైన ఎన్టీఆర్ దేవరతో తెలుగు సినిమాకు పరిచయమైన ఈ అమ్మడు ఈ మూవీ రిలీజ్‌కుముందే.. రామ్ చరణ్ ఆర్‌సి 16లో అవకాశాని దక్కించుకుంది. ఇక ఈ అమ్మడికి దేవరతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. నటనకు ఇంపార్టెన్స్ లేకపోయినా.. తన అందచందాలతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది జాన్వి. ఇక ఈ అమ్మడు గత ఏడాది సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.
వరుణ్ ధావన్ హీరోగా జాన్వి హీరోయిన్గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ హాట్ కాంబో కలయికలో.. మరో సినిమా రాబోతుంది. సన్నీసంస్కారిక్కి తులసి కుమారి.. సుశాంక్ ఖైతన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకున్నారు మేకర్స్. ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారట.
సన్నీ అనే వ్యక్తి ప్రియురాలు ప్రేమను గెలుచుకోవడానికి చేసే ప్రయత్నాలు.. ఆ ప్రేమ కథ చుట్టూ జరిగే సంఘటనలు సినిమా కథగా తెరకెక్కనున్నాయని తెలుస్తోంది. ఇందులో తులసి పాత్రలో జాన్వి, సన్నీగా వరుణ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నారు అని సినీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. సాన్య మలహోత్ర, అక్షయ్ ఒబెరాయ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కరణ్ జోహార్, అపూర్వ మహిత ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ మూవీ వచ్చేఏడాది ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.