టాలీవుడ్ లో చిరంజీవి మెగాస్టార్‌గా ఎలాంటి ఇమేజె క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి.. సీనియర్ స్టార్ హీరోగా ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తన సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఎన్నో పాత్రలో నటించిన చిరంజీవి.. మెగాస్టార్ రేంజ్‌కు ఎదగడానికి ఓ ప్రొడ్యూసర్ కారణమంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు.. అసలు అతనెలా కారణమో ఒకసారి తెలుసుకుందాం.
గతంలో మెగాస్టార్ ఓ డిజిటల్ క్రియేటర్స్ మీట్లో స్పెషల్ గెస్ట్ గా హాజరై సందడి చేశాడు. ఇందులో చిరంజీవిని.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో చిరంజీవి తన కెరీర్‌లో ఎదురైనా అవమానాన్ని గురించి వివరిస్తూ.. స్టార్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని.. అయితే ఇక్కడ జరిగిన అవమానం కారణంగా ఇంకా కసి పెరిగింది అంటూ చెప్పుకొచ్చాడు. న్యాయం కావాలి సినిమా చేస్తున్న టైంలో నిర్మాత క్రాంతి కుమార్ నాపై అకారణంగా విరుచుకుపడ్డారని.. గట్టిగట్టిగా అరిచారని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చాడు.ఆ మూవీ షూటింగ్ టైంలో అందరి మధ్య ఆయన అరిచేసరికి నాకు నిజంగా గుండె పిండేసినట్లు అయిపోయింది. నువ్వు ఏమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అంటూ ఆయన గట్టిగా అరిచారు. సెట్‌లో అందరి ముందు అలా అరవడం నాకు అవమానంగా అనిపించింది. అలాగే ఆయన అన్నట్లు సూపర్ స్టార్ అవ్వాలని కసి పెరిగింది. సూపర్ స్టార్ అయ్యి చూపిస్తా అని అప్పట్లో అనుకున్న అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఇలా ఎన్నో అవమానాలను, ఒడిదుడుకులను ఆయన జీవితంలో ఎదుర్కొన్నట్లు చిరంజీవి చెప్పుకొచ్చాడు. కాగా చిరంజీవి మెగాస్టార్ రేంజ్‌కు ఎదగడానికి ఆయనలో అంతా కసి పుట్టడానికి ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ పరోక్షంగా కారణమయ్యారట.