నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసులో కూడా చాలా చురుగ్గా వర్క్ చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. వయసు ఎంత పెరుగుతున్నా కూడా ఆ కటౌట్ లో మాస్ వేడి మాత్రం అస్సలు తగ్గడం లేదు. ప్రస్తుతం ఆయన తీరిక లేకుండా షూటింగ్స్ లో బిజీబిజీగా ఉంటున్నారు. ‘NBK109’ మాస్ ఎంటర్‌టైనర్‌గా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆహాలో ఎంతో పాపులర్ అయిన ప్రోగ్రామ్స్‌లో అన్‌స్టాపబుల్ కూడా ఒకటి.. ఎవరు ఊహించిన విధంగా బాలయ్య వ్యాఖ్యాతగా నిర్వహించిన ఈ షో ఎంతో స్పెషల్ అని చెప్పాలి. ఇప్పటికే రెండు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో త్వరలోనే మూడో సీజన్ కూడా రాబోతుంది. ఇప్పటికే తొలి ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ను కూడా ప్రారంభించారు.. గెస్టు్‌లుగా దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ వెంకీ అట్లూరి తొలి ఎపిసోడ్ కు వస్తున్నారు. లక్కీ భాస్కర్ సినిమా అక్టోబర్ నెలలో విడుదల కాబోతుంది. దీని క్రమంలోని అన్‌స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ కు వీళ్ళని పిలిచారు.
రాబోయే ఎపిసోడ్ల విషయంలో కూడా చాలా వార్తలు వస్తున్నాయి బాలయ్య ఇద్దరి అల్లుళ్లు, కూతుర్లు కూడా ఓ ఎపిసోడ్‌లో ఉంటారని టాప్ కూడా ఉంది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పెషల్ గెస్ట్ గా వస్తారని కూడా అంటున్నారు. మరి బాలయ్య ఈ సీజన్ తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారా చూడాలి.