త్రిష వల్లే నా లైఫ్ స్పాయిల్ అయింది.. తెర వెనుక ఆమె ప్రవర్తన ఇదే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్..!

సౌత్ స్టార్ హీరోయిన్గా త్రిష దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నాలుగు పదుల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ.. భారీ రమీనరేషన్‌తో సినిమా ఆఫర్లను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ మొదట్లో వర్షం, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా ఇలా వరుస హిట్ సినిమాలో నటించి ఆక‌ట్టుకుంది. కొత్త హీరోయిన్ల ఎంట్రీ తో అమ్మడి కెరీర్ కాస్త నెమ్మదించిన.. మళ్లీ అమ్మడికి హీరోయిన్గా పున్హ‌వైభవం వచ్చేసింది. ప్రస్తుతం హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్ హీరోయిన్ లో మొదటి వరుసలో పేరు సంపాదించుకున్న త్రిష.. వ్యక్తిగత జీవితంపై ఇప్పటికే ఎన్నో రూమర్స్ కూడా తలెత్తాయి. అదేవిధంగా తాజాగా నిర్మాతల.. కష్టనష్టాలకు సంబంధం లేకుండా ఆమె ప్రవర్తన ఇలా ఉంటుందంటూ నిర్మాత గిరిధర్ మామిడిపల్లి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Watch: Trisha's stylish horror act in 'Nayaki'

త్రిషపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. చాలా కాలంగా త్రిషతో సినిమా చేయాలనుకున్నా. ఒకసారి త్రిష డేట్ లు కుదిరాయి. కానీ.. నా దగ్గర కథ లేదు. ఆ టైంలో త్రిష.. బాలయ్య లయన్ మూవీలో నటిస్తుంది. ఈ క్రమంలోనే నీతో లేడీ ఒరియంటెడ్ సినిమా తీస్తానని అడిగా.. త్రిష ఒకే చెప్పింది. కానీ.. ఆమెకు ఎన్ని కథలు చెప్పినా నచ్చడం లేదు. అప్పుడు డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి ఓ హారర్ కథతో వచ్చారు. అది త్రిషకు నచ్చింది. వెంటనే సినిమా ప్రారంభించాం అంటూ వివరించాడు. త్రిషకు రెమ్యున‌రేషన్ ఫిక్స్ చేసి చెప్పామని.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. సినిమా మొదలైన కొద్ది రోజులు షూటింగ్ బానే జరిగింది. తర్వాత మాత్రం త్రిష, గోవర్ధన్ రెడ్డి వల్ల నాకు కష్టాలు మొదలయ్యాయి.

Director Govi talks about Trisha starrer Nayaki aka Nayagi

సినిమాపై వాళ్ళు సరిగ్గా ఫోకస్ చేయకుండా ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెట్టారంటూ వివ‌రించాడు. సినిమా పూర్తి అయిన టైంలో బిజినెస్ ప్రారంభమైంది. దీంతో గోవర్ధన్ రెడ్డి.. త్రిషకి చాడీలు చెప్పడం ప్రారంభించాడు. ఈ సినిమాకి పది కోట్ల వరకు బిజినెస్ అవుతుంది. మీకు మాత్రం ఇంత తక్కువ రెమ్యున‌రేషన్ ఇస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో త్రిష గొడవ ప్రారంభించింది. రూ.10 కోట్ల బిజినెస్ చేసుకుంటూ.. నాకు ఒక కోటి కూడా ఇవ్వకుంటే ఎలా అని రివర్స్ అయింది. ఆ టైంలో త్రిషకి అంత మార్కెట్ కూడా లేదు. సినిమాకి చాలా బడ్జెట్ అయింది. అసలు పెట్టిన బడ్జెట్ అయినా తిరిగి వస్తుందో.. లేదో.. తెలియని పరిస్థితి.

త్రిష వల్ల నా జీవితం అలా నాశనం' ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్ | Producer Giridhar Shocking Comments on Trisha Movie Nayaki Movie, - Telugu Filmibeat

కోటి రూపాయలు ఇవ్వలేం. కావాలంటే తమిళం సాటిలైట్ హక్కులు ఇస్తా అంటూ చెప్పుకొచ్చా.. ఎంత బతిమాలిన త్రిష వినలేదు. అడిగినంత రెమ్యూనరేషన్ చివరకు తీసుకుంది. సినిమా రిలీజ్ డిజాస్టర్ కావడంతో నా జీవితమే రివర్స్ అయిపోయింది. త్రిష సినిమా చేయాలని ఆలోచన రావడమే నా లైఫ్ స్పాయిల్ అవ్వడానికి కారణం అన్నట్లుగా డైరెక్టర్ వివరించాడు. ప్రస్తుతం డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, త్రిషపై నిర్మాత చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. త్రిష నిర్మాత పరిస్థితి అర్థం చేసుకోకుండా మరీ ఇలా ప్రవర్తించిందా.. త్రిష బయట రెమ్యూనరేషన్ విషయంలో ఇంత రూడ్‌గా ఉంటుందా అంటూ షాక్ అవుతున్నారు ఫ్యాన్స్‌. ప్రొడ్యూసర్ పట్ల అమ్మడి తీరుపై ఫైర్ అవుతున్నారు నెటిజ‌న్స్‌.