సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా ఎదగడానికి ఆహర్నిసలు శ్రమిస్తూ ఉంటారు. అయితే ఆ స్టార్ డం నిలబెట్టుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ నచ్చి.. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధపడతారు. అలా తమ సినిమా కోసం క్లైమాక్స్లో చనిపోయే పాత్రలు నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
నాగార్జున:
అక్కినేని హీరో నాగార్జున 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ‘ నిన్నే ప్రేమిస్తా ‘ క్లైమాక్స్ లో చనిపోతాడు.
ఎన్టీఆర్:
నందమూరి నట వారసుడు తారక్.. పూరి జగన్నాధ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ ఆంధ్రావాలా ‘ సినిమాల్లో.. అలాగే కే.ఎస్. రవీంద్ర డైరెక్షన్లో వచ్చిన ‘ జై లవ కుశ ‘ సినిమాలో.. రెండు సినిమాల్లోనూ క్లైమాక్స్లో చనిపోయే పాత్రను నటించారు.
ప్రభాస్
ఇక పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ ‘ బాహుబలి ‘ లో.. కృష్ణవంశీ డైరెక్షన్లో బచ్చిన ‘ చక్రం ‘ సినిమాల్లో.. రెండిట్లో క్లైమాక్స్‌లో చనిపోయే రోల్ ప్లే చేశాడు.
రవితేజ
మాస్ మహారాజ్ కూడా 2006లో రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన విక్రమార్కుడు సినిమాల్లో చనిపోయే పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
నాని:
తన నటనతో నేచురల్ స్టార్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నాన్ని.. ఈగ, జెర్సీ, భీమిలి కబడ్డీ జట్టు , జెంటిల్మెన్, శ్యామ్ సింగ రాయ్ ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు సినిమాల్లో క్లైమాక్స్‌లో చనిపోయే పాత్రలను ఎంచుకొని నటించాడు.
సాయి ధరమ్ తేజ్:
మెగా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయిధరమ్ తేజ్.. 2021లో దేవ.కట్ట డైరెక్షన్లో ‘ రిపబ్లిక్ ‘ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్లో తేజ్ మరణిస్తాడు.
రానా:
దగ్గుబాటి రానా హీరోగా.. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ నేనే రాజు నేనే మంత్రి ‘. 2017 లో రిలీజ్ అయిన ఈ సినిమా క్లైమాక్స్ లో రానా మారణిస్తాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కాజల్ కూడా మరణిస్తారు.