మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. తాజా మూవీ దేవర పై ట్రేడ్ వర్గలకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నెల 26న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు.. సినీ ప్రియులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, గ్లింప్స, పోస్టర్ ప్రతి ఒక్కటి సినిమాపై మరింత హైప్‌ను పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలో సినిమాకి సంబంధించిన థియట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇక అసలు విషయానికి వస్తే.. సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్‌లో అన్ని ప్రాంతాల్లో ప్రారంభమైపోయాయి.
ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాకి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్.. కనివిని ఎరుగని రేంజ్ లో ఉన్నాయని సమాచారం. దాదాపు అన్ని ప్రధాన చైన్స్ లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగా.. నిన్నటి వరకు సినిమాకు 594 షోస్ కి గాను.. ఏకంగా నాలుగు లక్షల పదకొండు వేల డాలర్లు కలెక్షన్లు వచ్చాయట. సినిమా రిలీజ్ 21 రోజుల ముందు ఈ రేంజ్ లో గ్రాస్ వశుళ్ళు రావడం అంటే.. అది నిజంగానే చెప్పుకోదగ్గ విషయం. మరో రెండు రోజుల్లో సినిమా వన్ మిలియన్ డాలర్లు దాటడం ఖాయమంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో మన టాలీవుడ్ సినిమాకు వన్ మిలియన్ ప్రీమియర్స్‌కు వస్తేనే చాలా గొప్ప. అలాంటిది ఇప్పుడు స్టార్ హీరోలకు 1 మిలియన్ ప్రీమియర్ అంటే నథింగ్. కనీసం టూ మిలియన్ డాలర్లు లేదా త్రీ మిలియన్ డాలర్లు ప్రీమియర్లకు వస్తే అద్భుతంగా వసూలు వచ్చినట్లు వెల్లడిస్తుంది.
ఇక దేవరకు అయితే ఏకంగా ప్రీమియర్ షోకే ఈ రేంజ్ లో వసూళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు దేవర సినిమా రాజమౌళి.. ఆర్‌ఆర్ఆర్ ప్రీమియర్ రికార్డుని బ్రేక్ చేయనుందా.. లేదా.. అనేది వేచి చూడాలి. ఒకవేళ అదే జరిగితే ఎన్టీఆర్ హిస్టరీని తిరగరాసినట్లే అవుతుంది. ఓవర్సీస్ మార్కెట్ గత రెండేళ్ల కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు వన్ మిలియన్ డాలర్ అంటే చాలా తక్కువ. ఒకప్పుడు స్టార్ హీరోలకు మాత్రమే రెండు మిలియన్ డాలర్లు వచ్చేవి. కానీ.. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని సినిమాకు కూడా రెండు మిలియన్ డాలర్లు వసూళ్ళు వచ్చేసాయి. ఈ లెక్కన చూసుకుంటే దేవర సినిమా సూపర్ హిట్ టాక్ వస్తే.. కేవలం అమెరికాలోని ఏకంగా 10 మిలియన్ డాలర్ల వసూలు రావడం పక్కా అంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే 88 కోట్ల గ్రాస్ వసూలు కేవలం నార్త్ అమెరికా నుంచే వస్తుందని అంచనా. ఇక ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎలాంటి అద్భుతాలను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.