ఆ కమెడియన్ చేతిలో చెంప దెబ్బలు తిన్న ఎస్.జె.సూర్య.. కారణం ఇదే..?

దర్శకుడుగా.. నటుడుగా భారీ పాపులారిటి దక్కించుకుని దూసుకుపోతున్నాడు ఎస్‌.జే.సూర్య‌. ఇండియన్ బెస్ట్ యాక్టర్ గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటున్న ఈయన.. తన విలక్షన నటనతో ప్రేక్షకులను విపరీతంగా అకట్టుకుంటున్నాడు. ఇక తాజాగా నాని నటించిన సరిపోద శనివారం సినిమాలో తన అద్భుతమైన విలనిజంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసిన వారంతా మొట్టమొదట ఎస్‌.జే. సూర్య గురించే ప్రస్తావిస్తున్నారు. ఆయన నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో నాని కంటే ఎస్‌.జే.సూర్య పాత్ర ఎక్కువగా డామినేట్ చేస్తుందని.. ఆయన పాత్ర సినిమాకు హైలైట్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

Saripodhaa Sanivaaram (2024) - Movie | Reviews, Cast & Release Date -  BookMyShow

హీరో నాని కూడా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇక సరిపోదా శనివారం సక్సెస్ మీట్ లో ఎస్.జే.సూర్య మాట్లాడుతూ షూటింగ్లో జరిగిన ఆసక్తికర సంఘటన గురించి వివరించాడు. సీనియర్ నటుడు.. కమెడియన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న శివాజీ రాజా.. ఓ సందర్భంలో తనని నిజంగానే దవడ పగిలేలా కొట్టాడంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా క్లైమాక్స్లో శివాజీ రాజా చేతిలో ఎస్.జే. సూర్య దెబ్బలు తినే సీన్స్ ఉంటాయి. అయితే ఈ సీన్ పై ఎస్.జే. సూర్య వివరిస్తూ.. శివాజీ రాజు గారు చేతిలో తన్ను చంప దెబ్బ తినే సన్నివేశం మామూలుగానే ఊరికే కొట్టేలా తీశారని.. కానీ డైరెక్టర్ వివేక్ వచ్చి సీన్ సరిగ్గా రాలేదని ఈ దెబ్బలను చీటింగ్ కాకుండా నిజంగానే కొట్టించుకుంటారా అని అడిగారని.. అందుకు నేను ఓకే చెప్పానంటే చెప్పుకొచ్చాడు.

SJ Suryah - Sivaji Raja : ఆయన చేత్తో చెంప దెబ్బ కొట్టించుకున్న SJ సూర్య..  దవడ పగిలింది.. పాపం కరాటేలో బ్రౌన్ బెల్ట్ అని తెలియక.. | Sj suryah revealed  interesting scene with ...

అయితే శివాజీ రాజా గారిని నేనే పిలిచి పర్లేదు గట్టిగా కొట్టండి సార్ అని వివరించాన‌ని.. ఆయన ఒకేఒక్క కొట్టు కొట్టాడు.. దాంతో దవడ సైడ్ కి వెళ్ళిపోయింది అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ఇక ఆ దెబ్బ నుంచి తేరుకున్న తర్వాత.. శివాజీ రాజా గారిని పిలిచి ఒకసారి మీ చేయి చూపించండి అని అడిగితే తాను కరాటే బ్రౌన్ బెల్ట్ అని చెప్పారని.. మొదటి నాకు ఆ విషయం తెలియదంటూ చెప్పుకొచ్చాడు. ఇక తర్వాత మళ్లీ రీటెక్ తన కోసం చేయించారంటూ వివరించాడు. ప్రస్తుతం ఎస్. జె. సూర్య చేసిన ఈ కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.