ఏంటి దేవర అన్ని రివర్సే అవుతున్నాయి.. ఎక్కడో తేడా కొడుతుందే..!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర పై ప్రేక్షకుల్లో భారీ లెవెల్ లో అంచనాలున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే అనిరుధ్‌ వల్ల దేవర సినిమా విషయంలో వస్తున్న కామెంట్స్ చూస్తుంటే అది నిజమే కదా అని అనిపించక మానదు. అనిరుధ్‌ను చాలామంది అన్నిరుద్దుడు అనే ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. ఫియర్ సాంగ్ నుంచి మొదలైన ఈ కామెంట్స్ లేటెస్ట్ గా వచ్చిన దావూదీ సాంగ్ వరకు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే ఫైనల్ గా దేవరకు మాత్రం సీన్ రివర్స్ అవుతు ఆ కామెంట్స్ ప్ల‌స్ అవుతున్నాయి.

ముందుగా పాట బాగోలేదు అంటూ ట్రోల్స్.. ఆ తర్వాత రీల్స్, హుక్ స్టెప్స్ మిలియన్ ఆఫ్ వ్యూస్ తో సోషల్ మీడియాను ఆటాడుకుంటున్నారు. అందుకు నిదర్శనమే చుట‌మల్లే సాంగ్ అనడంలో సందేహం లేదు. ఈ పాట రిలీజ్ అయిన వెంటనే ఓ శ్రీలంక సాంగ్‌కు ఇది కాపి అంటూ ట్రోల్స్ మొదలైపోయాయి. అయితే తర్వాత ఈ సాంగ్ ఏకంగా 100మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. ఇంతకుముందు వచ్చిన ఫియర్ సాంగ్ చూస్తే అనిరుధ్ డామినేషన్ ఎక్కువైందని.. ఎన్టీఆర్ కంటే అనిరుధ్‌ ఎక్కువగా కనిపించాడు అంటూ.. కాస్త సాంగ్ గజిబిజిగా అనిపించింది అంటూ విమర్శలు వినిపించాయి. అయితే ఇప్పుడు మాస్ బీట్ అంటూ పాటను ఆడియ‌న్స్ రిసీవ్ చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది. పాట, ఎన్టీఆర్ స్టెప్స్, జాన్వి గ్లామర్ ఓకే అనిపించుకున్నా అనిరుధ్‌ మాత్రం తన పాటను తానే కాపీ చేసి బీట్లు కొట్టాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

గతంలో విజయ్ బిగిల్‌ సినిమాలో హలమితీ హ‌బీబి బిజీయ‌మ్ అనిరుధ్ దేవరలోను దించేసాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హ‌లమితి పాటకు.. దావూది స్టెప్పులకు కలిపి చూస్తే ఎక్క‌డో తెడ‌కొడుతుంద‌ని.. ఏది ఒరిజ‌న‌ల్‌ తెలుసుకోవడం కష్టం అన్నట్లుగా ఇందులో స్టెప్పులు ఉన్నాయని.. మ్యూజిక్ తో పాటు స్టెప్స్ కూడా రెండు పాటల్లోను సేమ్ గా అనిపిస్తున్నయంటూ టాక్ న‌డుస్తుంది. ఈ క్రమంలో ఈ సాంగ్ పై కూడా విపరీతంగా ట్రోల్స్ ఎదురవుతున్నాయి. ఇక ఈందులో భాగంగా దావుది సాంగ్ కూడా రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో సాగిపోతున్న ఈ సాంగ్.. ఇండియా వైడ్ నెంబర్ వన్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ముందు నెగిటివ్ టాక్ వచ్చిన ప్రతి సాంగ్ కూడా దేవరకు చాలా ప్లస్ అయ్యింది. కానీ అనిరుధ్ధుడు అనే కామెంట్ కు మాత్రం అనిరుద్ కి చెక్ పడడం లేదు. దేవర నుంచి ఒక సాలిడ్ ఫ్రెష్ సాంగ్ బయటకు వస్తే గాని అనిరుధ్‌కు ఈ తిప్పలు తప్పవు.