69 ఏళ్ల వయసులోనూ చిరంజీవి యంగ్ అండ్ ఫిట్నెస్ వెనుక సీక్రెట్స్ ఇవే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 69 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ అదే యంగ్‌లుక్‌, ఫిట్నెస్ తో యూత్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకుంటున్న చిరంజీవి.. ఇప్పటికీ ఇంత ఎనర్జిటిక్‌గా ఉండడానికి వెనక అసలు సీక్రెట్ ఏంటో.. ఆయన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. ఈ క్రమంలో మెగాస్టార్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. చిరంజీవి తన ఫిట్నెస్ వెనుకాల ఎంతో కఠినమైన డైలీ రొటీన్ ఉంటుందట‌. ఎప్పటి పనిని అప్పుడే బ్యాలెన్స్ లేకుండా చేసేస్తారట. ప్రతిరోజు తప్పనిసరిగా ఎక్సర్సైజ్ ఆయన డైలీ రొటీన్ లో ఉంటుంది. కుటుంబం కోసం రోజు కొంత సమయాన్ని కేటాయించే చిరు.. ప్రతిరోజు ఎక్సర్సైజ్, యోగా తదితర విధానాల తో శారీరక దృఢత్వానికి చిరంజీవి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాడు.

Watch: Chiranjeevi hits the gym at 68 for next film 'Viswambhara', shares  video - India Today

ఇక ఎంత గొప్పవారికైనా.. ఇలాంటివారి కైనా స్ట్రెస్ సాధారణంగానే ఉంటుంది. అలా ఒత్తిడిని బ్యాలెన్స్ చేసుకోవడానికి యోగ చేస్తూ ఉంటారు. చిరంజీవి మనసుకు ప్ర‌శాంత‌త‌ కలిగించే పనులకే ఆసక్తి చూపుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కుటుంబంలోని పిల్లలతో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తారు. స్వచ్చంద కార్యక్రమాల్లో పాల్గొని తన మంచితనాన్ని కూడా చాటుకుంటారు. అయితే చిరు ఎంత బిజీలో ఉన్నా.. తన నిద్రకు మాత్రం ఎప్పుడూ బంగం రానివ్వరు. ప్రతిరోజూ తప్పనిసరిగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రిస్తారు. ఆధ్యాత్మిక మార్గాన్ని చిరంజీవి ఎప్పటికప్పుడు అనుసరిస్తూ ఉంటాడు. అలాగే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లిన్‌ ప్రోటీన్లతో ఆహారాలను సేవించే చిరు.. శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా ఎప్పటికప్పుడు బాడీకి సరిపడా నీటిని అందిస్తూ ఉంటారు.

Megastar Chiranjeevi Cooking Fish : అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట.. వీడియో  వైరల్! | Megastar Chiranjeevi Cooking Fish For His Mother

అలాగే ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారంతో టేస్టీ ఫుడ్ ను ఎంజాయ్ చేస్తారు. చిరంజీవి చాలా మితంగా తింటూ ఉంటారు. తెలుగు సాంప్రదాయ వంటలు ఇష్టంగా తీసుకుంటారు. అల్పాహారంతో తన రోజు ప్రారంభిస్తారు. లంచ్, డిన్నర్ కోసం పులిహార, పప్పు, సాంబార్, చేపలు చికెన్ లాంటి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని ఆస్వాదిస్తారు. అల్పాహారం, స్నాక్స్ లోను జంక్ ఫుడ్ ను తీసుకోరు. పండ్లు గింజలు లాంటి ఆహారాలని తింటారు. ప్రతిరోజు రాత్రి 8 నుంచి 9 గంటల లోపే తన డిన్నర్ ను ముగించేస్తారు. ఈ విధమైన లైఫ్ స్టైల్ లో చిరంజీవి బ్యాలెన్స్ చేయడమే అంత ఫిట్నెస్ కు కారణం అంటూ సన్నిహితులు చెబుతున్నారు. ఇక మీరు కూడా చిరంజీవి లాంటి లైఫ్ స్టైల్ అనుసరిస్తే అదే ఫిట్నెస్, ఎనర్జీ మీ సొంతం.