పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సామాన్య, సినీ , రాజకీయ ప్రముఖులు కూడా ఎంతోమంది పవన్‌ను విపరీతంగా అభిమానిస్తూ ఉంటారు. అలా ఈ పై ఫోటోలో పవన్ పక్కన కనిపిస్తున్న కుర్రాడు కూడా అదే కోవకు చెందిన వ్యక్తి. అయితే ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫేమస్ సెలబ్రిటీ. పవన్ కళ్యాణ్ కు డై హార్డ్ ఫ్యాన్. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తన స్వయంకృషి శ్రమతో సక్సెస్ సాధించిన వారిలో ఈ కుర్రాడు కూడా ఒకడు.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందు ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్న ఎప్పుడు వెనకడుగు వేయలేదు. పాపులర్ డ్యాన్స్ రియాల్టీ షో.. ఢీతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తన హుషారు, దుమ్ము రేపే స్టెప్పులతో స్టార్ కంటపడ్డాడు. కేవలం టాలీవుడే కాదు.. కన్నడ, తమిళ, బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. ముఖ్యంగా మెగా హీరోల ఫేవరెట్ కొరియోగ్రాఫర్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈయన.. ప్రస్తుతం సినిమాలతో పాటు.. పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా రాజకీయాల్లోనూ సందడి చేస్తున్నాడు.
ఇప్పటికైనా అతనెవరో గుర్తుపట్టారా.. ఎస్ మీ గెస్ కరెక్టే. అతనే జానీ మాస్టర్. ఇక ఈ పై ఫోటో.. బాలు సినిమా షూట్ టైంలోది. 2009లో నితిన్ నటించిన ద్రోణ సినిమాతో డాన్స్ మాస్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన జాని.. తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్, పవన్ ఇలా ఎంతోమంది బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించాడు. తమిళ్‌లో దళపతి విజయ్, కన్నడ సుదీప్ కిచ్చా, బాలీవుడ్ సల్మాన్ ఖాన్ లాంటి హీరోలతో పనిచేశాడు. ఈ క్రమంలో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జానీ మాస్టర్ ఉన్న తన యంగ్ ఏజ్ ఫోటో తెగ వైరల్ గా మారుతుంది.