ఇలాంటి చెత్త సినిమాలు ఫ్లాప్ అవ్వడమే కరెక్ట్.. ఇండియన్ 2 పై రేణుదేశాయ్ షాకింగ్ కామెంట్స్..!

ఒకప్ప‌టి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 సినిమా పై చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో, మెగా ఫాన్స్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. కమలహాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఇండియన్ 2 బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. యాక్షన్ మూవీ గా పాన్ ఇండియా లెవెల్‌లో భారీ ఎత్తున రిలీజైన‌ ఈ సినిమాలో.. కథ‌, కథనాలు, విజువల్స్‌తో పాటు.. ప్రధాన పాత్రలో నటించిన నటుల విషయంలోనూ దారుణంగా విమర్శలు ఎదురైన సంగతి తెలిసిందే. ఇక సినిమా దర్శకుడు శంకర్ నైతే అవుట్డేటెడ్ డైరెక్టర్ అంటూ నెటిజ‌న్స్ విప‌రీతంగా ట్రోల్స్ చేశౄరు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిన ఇండియన్ 2 సినిమా రూ.100 కోట్ల కలెక్షన్‌లు కూడా రాబట్టలేక.. నిర్మాతలను దారుణంగా ముంచేసింది.

Indian 2 (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

అయితే ఇండియన్ 2లో వీధి కుక్కలను ఉద్దేశించి శంక‌ర్‌ టీం రాసిన డైలాగ్‌ల‌పై యానిమల్ లవర్స్ తెగ ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో కొన్నిచోట్ల విలన్స్‌ను కుక్కలతో పోలుస్తూ క‌మ‌ల్‌ డైలాగ్స్ చెప్తూ ఉంటాడు. నీతి, జాతి లేని కుక్క.. డర్టీ ప్రిటీ డాగ్ అంటూ కమలహాసన్ చెప్పే డైలాగ్ సోషల్ మీడియాలో పెట్ లవర్స్ ను విపరీతంగా హర్ట్ చేసింది. ఈ క్రమంలో ఇండియన్ 2ల్ డైలాగ్స్ పై సోషల్ మీడియాలో పెట్ లవర్స్ అంతా విమర్శలు గుప్పిస్తున్నారు. అలా విమర్శలు గుప్పిస్తున్న ఆడియన్స్‌లో రేణు దేశాయ్ కూడా ఒకటి. ఇండియన్ 2 సినిమా పోస్టర్‌ను అమ్మ‌డు పోస్ట్ చేస్తూ.. ఇలాంటి చెత్త సినిమా ఫ్లాప్ అవ్వడమే కరెక్ట్.. నాకు ఈ మూవీ ఫ్లాప్‌ చాలా సంతోషంగా ఉందంటూ వివరించింది. వీధి కుక్కలు డర్టీ కాదు.. వాటిపై ప్రేమను చూపించాలి తప్పితే ద్వేషాన్ని కాదు అంటూ తన ఇన్స్టాల్ స్టోరీలో రాసుకొచ్చింది. ఇలాంటి చెత్త డైలాగులు ఎలా రాస్తారో అంటూ ఫైర్ అయిన రేణు డైలాగ్ రాసిన రైటర్స్ ను ఇడియట్స్ అంటూ తన పోస్టులో పేర్కొంది.

Renu Desai: రేణుదేశాయ్ తో అలా చెప్పించిన వ్యక్తి ఎవరో తెలుసా?

ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ నెటింట హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ఆమెకు కొంతమంది సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. మరికొందరు మాత్రం రేణు దేశాయ్‌పై విమర్శలు కురిపిస్తు.. లెజెండ్రి యాక్టర్, డైరెక్టర్ చేసిన సినిమాపై రేణు దేశాయ్ ఇలాంటి ఓపెన్ కామెంట్స్ చేయడం అస్సలు సరికాదు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండియన్ 2 తర్వాత రామ్ చరణ్ తో గేమ్ చేంజర్‌ సినిమాను శంకర్ తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా అభిమానుల్లో ఇండియన్ 2 డిజాస్టర్‌తో గేమ్ చేంజర్ విషయంలో టెన్షన్ మొదలైంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను.. నేడు అనౌన్స్ చేయనున్నారు. డిసెంబర్ 24 న‌ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇలాంటి క్రమంలో రేణు దేశాయ్.. శంకర్ గురించి ఆయన సినిమా గురించి నెగటివ్ కామెంట్స్ చేయడం హాట్‌ టాపిక్ గా మారింది. ఇక శంకర్.. చరణ్‌కు ఎలాంటి రిజల్ట్ ఇస్తాడు.. ఈ సినిమాతో అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో.. లేదో.. వేచి చూడాలి.