సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ థ్రో బ్యాక్ థీంతో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించిన థ్రో బ్యాక్ ఫోటో నెటింట వైరల్‌గా మారుతుంది. చిరంజీవి ఓ చిన్న పిల్లాడిని గట్టిగా పట్టుకున్న ఫోటో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నోడు ప్రస్తుతం ఓ యంగ్ హీరో. ఒకప్పటి స్టార్ హీరో కొడుకు కావడం విశేషం. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇస్తూ.. సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా..? బాల నటుడుగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా మారిన ఈ కుర్రాడు.. తన నటనతో ప్రశంసలు దక్కించుకుంటున్నాడు.
ఇంతకీ ఆ హీరో ఎవరో గెస్ చేశారా..? అతనే సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్. అన్నయ్యతో నా కుమారుడు అంటూ గతంలో శ్రీకాంత్ ఈ ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. నిర్మల కాన్వెంట్ సినిమాతో బాల నటుడుగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన రోషన్.. తర్వాత పెళ్లి సందడి సినిమాతో హీరోగా మారి మంచి సక్సెస్ అందుకున్నాడు. డైరెక్టర్ రాఘవేందర రావు తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక 2021లో రిలీజ్ అయిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రోషన్ హీరోగా ఛాంపియన్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రదీప్ అద్వైతం డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇటీవల అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.
ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న విశ్వంభర షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జట్‌లో గ్రాండ్ లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక గతంలో బింబిసారతో బ్లాక్ బస్టర్ కొట్టిన వశిష్ట.. సోషియా ప్లాంట్ డ్రామగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి.