ఓ సినిమా తెరకెక్కిస్తున్నారంటే.. ఆ సినిమా విషయంలో ఎడిటర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తాడు. ఎందుకంటే సినిమా షూట్ టైంలో దర్శకులు ఎన్నో సన్నివేశాలను షూట్ చేస్తారు. అలాగే కొన్ని సాంగ్స్‌ని, యాక్షన్ సీన్స్‌ని కూడా రూపొందిస్తారు. అయితే ఎడిటర్ అనే వాడు లాస్ట్‌లో ఎంట్రీ ఇచ్చిన.. సినిమాకు ఏది అవసరం..? ఏది అవసరం లేదు..? సినిమాలో ఎంత కథ ఉంటే కరెక్ట్..? రన్ టైం ఎలా ఉంటే పర్ఫెక్ట్..? ఇలా ఎన్నో విషయాల్లో తనే సరి చూసుకుంటూ సినిమా సక్సెస్ కు కీలక పాత్ర వహిస్తాడు. అలా సినిమా షూట్ మొత్తం పూర్తయి ఫైనల్ గా ఎంట్రీ ఇచ్చిన.. ఎడిటర్ సినిమా రిజల్ట్స్ మొత్తం మార్చేసే ఛాన్స్ ఉంటుంది.
అలా టాలీవుడ్ లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎడిటర్లలో మార్తాండ్ కే వెంకటేష్ కూడా ఒకరు. ఈయన తన కెరీర్ లో ఎన్నో సినిమాలకు ఎడిటర్ గా వ్యవహరించాడు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఎన్నో సినిమాలకు ఎడిటర్‌గా వ్యవహరించి. మార్తాండ్ కె వెంకటేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు. అందులో భాగంగా పవన్ హీరోగా తెరకెక్కిన బద్రి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వెంకటేష్ మాట్లాడుతూ పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన బద్రి మూవీకి నేను ఎడిటర్‌గా చేశా.. అయితే ఈ సినిమా ఎడిట్ చేస్తున్న టైంలో పవన్ తో మాట్లాడుతూ.. ఈ సినిమాలో అసలు కథ లేదు సార్.. ఇందులో స్టోరీ లేకుండా ఆడియన్స్‌కు ఎలా నచ్చుతుంది.. ఈ సినిమా ఆడటం కష్టమే అని చెప్పానని వివరించాడు.
దీనిపై పవన్ రియాక్ట్ అవుతూజజ పెద్దగా కథలేకపోయి ఉండొచ్చు.. కానీ స్క్రీన్ ప్లే బాగుంది. పాటలు, ఇతర అంశాలన్నీ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది వెంకటేష్ అని చెప్పాడట. అలా పవన్ చెప్పినట్లే బద్రి సినిమా మంచి సక్సెస్ అందుకుంది అంటూ వెంకటేష్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బద్రి సినిమాలో వెంకటేష్ చేసిన ఈ కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.