పాన్ ఇండియన్ స్టార్ హీరో.. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, కోలీవుడ్ స్టార్ సూర్య వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి.. ఈ సినిమా రిజల్ట్ ఊహకు కూడా అందదు. అయితే ఈ ఇద్దరు కాంబోలో సినిమా సెట్ అవ్వడం అంటే సాధారణ విషయం కాదు. గతంలో వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటూ ఎన్నో రూమర్లు వచ్చినా.. ఒక్కసారి కూడా నిజం కాలేదు. అయితే ఈసారి మాత్రం దాదాపు ఈ క్రేజీ కాంబో సెట్ అయిపోయినట్లే సమాచారం. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదేంటంటే వీరిద్దరూ నటిస్తున్న ఈ సినిమా మల్టీస్టారర్ మూవీ కాదు.. ఇద్దరు ఓకే స్క్రీన్ లో కనిపించే అవకాశం ఉన్నా.. ఇద్దరూ ఒకే సీన్లో కనిపిస్తారా.. లేదా.. అనేది గ్యారెంటీ లేదట. అసలు వీళ్ళిద్దరూ కలిసి నిజంగానే సినిమాలో నటిస్తున్నారా.. అంటే అది కూడా క్లారిటీగా చెప్పలేం.
కానీ బాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ఈ ఇద్దరు ఓ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారట. ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్స్ లో సింగం అగైన్ సినిమా ఒకటి. అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. మోస్ట్ అవైటెడ్ మూవీ గా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చే దీపావళికి గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుందని టాక్. ఇక ఈ సినిమాలో ప్రభాస్, సూర్య గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. రీసెంట్గా రోహిత్ శెట్టి.. కల్కి మ్యూజిక్ వాడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ప్రభాస్.. సింగం అగైన్ లో క్యామియో రోల్‌లో కనిపించనున్నాడని టాక్ మొదలైంది.
అయితే ప్రస్తుతం ఒరిజినల్ సింగం.. సూర్య కూడా ఈ సినిమాల్లో గెస్ట్ రోల్ లో చేస్తున్నాడు అంటూ తెలుస్తోంది. సూర్య చేసిన సింగం సిరీస్ ఇక్కడ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదే సిరీస్ ను బాలీవుడ్ లో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు ఆ సిక్వెల్‌లో సూర్య కూడా కనిపించే అవకాశం ఉందట. ఇందులో నిజంతో తెలియదు గానీ.. ప్రస్తుతం ప్రభాస్, సూర్య కలిసి ఒకే సినిమాల్లో నటిస్తున్నారంటూ వార్తలు నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక నిజంగానే ప్రభాస్, సూర్య ఈ సినిమాలో కనిపిస్తే.. సినిమా పై ఆడియన్స్ లో హైప్ మామూలుగా ఉండదని చెప్పాలి. ఇక గతంలోనే ప్రభాస్ ఓ బాలీవుడ్ మూవీ యాక్షన్ జాక్సన్.. సినిమాల్లో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. తాజాగా సూర్య.. సర్పిర సినిమాలో క్యామియో రోల్‌లో మెరిశాడు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి అజయ్ దేవగణ్ కోసం రంగంలోకి ఎంట్రీ ఇస్తారా.. లేదా.. తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.