పవన్ రిజెక్ట్ చేసిన కథలతో మాస్ మహారాజ్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ కొట్టిన సినిమాలు ఇవే..!

టాలీవుడ్ పవర్ స్టార్.. తాజా ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బ‌స్టర్ సినిమా కథలను కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా పవన్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో మాస్ మహారాజ్ రవితేజ నటించి బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక‌ రవితేజ నటించి సక్సెస్ అందుకున్న ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.

Watch Idiot (Telugu) Full Movie Online | Sun NXT

పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో మొదట బద్రి సినిమా వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక బద్రి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబోలో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా వ‌చ్చి బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాల మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో కూడా పూరి జగన్నాథ్ పవన్‌తో సినిమా చేయాలని ఎన్నో కథలను అనుకున్నాడట. కానీ.. పవన్ మాత్రం ఆ సినిమాలు నచ్చక రిజెక్ట్ చేశాడు. అలా పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్ కు.. ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి మూడు సినిమాలను కథలను చెప్పాడట.

Amma Nanna O Tamila Ammayi - Wikipedia

కానీ కథలు విన్న పవన్.. పాజిటివ్ గా రియాక్ట్ అయినా ఏవో కార‌ణాల‌తో సినిమాలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాలు మాస్ మహారాజ్ చేతికి వెళ్లాయి. ఇక పోకిరి సినిమాలో మహేష్ బాబు నటించి భారీ స‌క్స‌స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా పవన్ రిజెక్ట్ చేసిన ఈ మూడు సినిమాలతో పూరి జగన్నాథ్‌కు బ్లాక్ బ‌స్టర్లు వచ్చాయి. అయితే పవన్ చేసిన మూవీలతో రవితేజ ఏకంగా రెండు బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకోవడం విశేషం. అలాగే రవితేజ కెరీర్ ప్రారంభంలో ఈ రెండు సినిమాలు తెరకెక్కి హిట్లు కావడంతో.. ఈయన కెరీర్‌కు మరింత ప్లస్ అయింది. ఈ రెండు సినిమాల సక్సెస్‌తో రవితేజ స్టార్ హీరోగా మారి ప్రస్తుతం మాస్ మహారాజ్ రేంజ్‌కు ఎదిగాడు.