డే వన్ కే సెంచరీ కొట్టేలా దేవర బ్రహ్మాస్త్రం.. మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

జూనియర్ ఎన్టీఆర్, కొర‌టాల‌శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా మూవీ దేవర. మై ఓల్టేజ్ యాక్షన్ ఎంట్రటైనర్గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో రిలీజ్ డేట్ దగ్గర అవుతున్న కొద్ది.. ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెల‌కొంటున్నాయి. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి.. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసాయి. విడుదలైన మూడు సాంగ్స్ కూడా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మొదటి ట్రోల్స్ వచ్చినా తర్వాత మిలియ‌న్‌ల‌ కొద్ది వ్యూస్ సంపాదిస్తూ ట్రేడింగ్ లో నిలిచాయి. ఇక షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న టీం.. ప్రమోషన్స్ లో కూడా జోరును పెంచేసాయి. ఇదిలా ఉంటే.. దేవర సినిమాకు సంబంధించి ఓవర్సీస్ లో వారం కిందటే బుకింగ్స్ మొదలుకాగా రిలీజ్ ఇంకా 3 వారాలు ఉన్నా.. ఇప్పటికే 600 కే డాలర్లకు పైగా బుకింగ్స్ దేవర క్రాస్ చేసింది.

ఇక పాన్ ఇండియ‌న్ సినిమాగా భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కునున్న దేవర.. ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అన్ని భాషల్లో మంచి హైప్‌ నెలకొంది. కానీ.. దేవర సినిమా ప్రమోషన్స్ లేకుండా ఓపెనింగ్ సాలిడ్గా ఉంటాయా అంటే సందేహమే. తెలుగు రాష్ట్రాల ప్రమోషన్లు చేసిన చేయకపోయినా.. తారక్‌ క్రేజ్‌ను బట్టి సెన్సేషనల్ ఓపెనింగ్స్ పక్కా. అయితే ఇతర భాషల్లో మంచి ఓపెనింగ్స్ కోసం యూనిట్ ఇప్పటినుంచి ప్రమోషన్ టూర్లు వేస్తూ ఉండాలి. ఇక ప్రస్తుతం దేవర హైప్‌ను బట్టి రూ.90 నుంచి రూ.100 కోట్ల ఓపెనింగ్స్ కు అవకాశం ఉంది. అయితే రూ.100 నుంచి రూ.150 కోట్లు ఓపెనింగ్స్ రావాలంటే దేవరకు మరింత సాలిడ్ బజ్‌ రావాలి. ఈ క్రమంలో ఉన్న మూడు వారాల్లో ఇండియా వైడ్ గా భారీ ప్రమోషన్స్ చేసి యూనిట్ బాగా కష్టపడాల్సి ఉంటుంది. అయితే దేవరకు అలా టూర్లతో పని లేకుండా హైప్‌ మరింతగా పెరగాలంటే ఉన్న ఏకైక మాస్టర్ ప్లాన్ దేవర థియేటర్ ట్రైలర్.

Devara: Jr NTR looks magnetic in new poster as makers announce trailer  release date - India Today

కేవలం థియేటర్ ట్రైలర్ వల్ల మాత్రమే ఈ రేంజ్ లో రికార్డ్ కలెక్షన్స్ సాధ్యమవుతాయి. టీజర్ వల్ల దేవరకు మంచి హైప్ వ‌స్తుంది. అయితే ట్రైలర్‌తో దానికి మించిన హైప్‌ తీసుకువస్తే ప్రేక్షకులు సినిమాను చూడడానికి ఎగబడతారు అన్నడంలో సందేహం లేదు. ట్రైలర్ ని ఎంత ఫ్రెష్ గా ప్రేక్షకులకు నచ్చేలా చూపిస్తే.. సినిమాపై అంత హైప్‌ని తీసుకురావచ్చు. ఈ క్రమంలోనే మేకర్స్‌.. థియేట్రిక‌ల్‌ ట్రైలర్ పై మొత్తం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఎలాగైనా మొదటి రోజు రూ.100 నుంచి రూ.150 కోట్ల మార్కు ఓపెనింగ్ సాధించాలని కసితో ప్లాన్ చేస్తున్నారట. ఇక గతంలో సలార్, కల్కి 2898ఏడి సినిమాకి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే ట్రైలర్‌తో మంచి హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేవర కూడా ఇదే ప్లాన్ ఫాలో అయ్యి.. ట్రైలర్ బ్రహ్మస్త్ర సంధించి సక్సెస్ అందుకుంటే.. సినిమాపై హైప‌ఖ‌పెరగడం ఖాయం.. ఈ సినిమా మొదటి రోజే రూ.100 నుంచి రూ.150 కోట్ల మార్కు ఓపెనింగ్ సాధించడం పక్కా అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.