ఆయనతో సినిమా నావల్ల కాదు.. ఆయనకో నమస్కారం.. బాలయ్య పై రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా రాణించిన వారిలో రకుల్ ప్రీత్‌ కూడా ఒకటి. ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంది. వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించి మెప్పించింది. అయితే అతి తక్కువ సమయంలోనే స్టార్‌డంను సంపాదించుకున్న ఈ అమ్మడు.. అంతే స్పీడుగా ఫెడవుట్ అయ్యే స్టేజ్ కు వచ్చేసింది. వరుస సినిమాల్లో నటిస్తున్న సమయంలో పూజా హెగ్డే, రష్మిక మందన ఎంట్రీ తో అమ్మడికి భారీగా అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలో టాలీవుడ్ లో చాలా కాలం నుంచి నటించలేదు. అయితే మళ్లీ ఇటీవల ఇండియన్ 2 సినిమాలో సిద్ధార్థ్ స‌ర‌సన నటించే అవకాశాన్ని కొట్టేసింది.

Kathanayakudu: Balakrishna and Rakul Preet recreate the magic of NTR-Sridevi

ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో మళ్లీ ఫామ్ లోకి వచ్చి కుమ్మయోచ్చని భావించింది. కానీ అమ్మడి అసలు అడియాస‌ల‌య్యాయి. సినిమా థియేటర్‌లో డిజాస్టర్ అయ్యింది. ఇలాంటి క్రమంలో రకుల్ ప్రీత్ కి సంబంధించిన ఓ వర్త నెటింట వైరల్‌గా మారుతుంది. బాలయ్య సినిమాలో బంగారం లాంటి అవకాశం వస్తే రకుల్ ఆ సినిమాను రిజెక్ట్ చేసిందట బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ కమర్షియల్‌గా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్‌కి ముందు అవకాశం వచ్చిందట. కానీ బాలయ్యతో నేను చేయలేను.. నాకు భయం అని చెప్పి సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Akhanda: హిట్ సినిమాని చేతులారా వదులుకున్న హీరోయిన్లు | Balakrishna Akhanda  these Heroines who Missed the Movie Chance

ఆమె అలా అనడానికి ఒక కారణం కూడా ఉందట. ఇక బాలయ్య.. ఎన్టీఆర్ బయోపిక్ లో నటించిన సంగతి తెలిసిందే. కథనాయకుడు మూవీలో రకుల్ ప్రీత్.. అతిలోకసుందరి శ్రీదేవి పాత్రలో మెప్పించింది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య శ్రీదేవితో కలిసి సినిమా చేయలేదని.. కానీ శ్రీదేవి పాత్ర వేసుకున్న నాతో సినిమా చేశారంటూ చెప్పుకొచ్చింది. అయితే రకుల్ ప్రీత్ చేసిన కామెంట్స్‌ఖు బాలయ్య‌ సీరియస్‌గా ఆమెపై ఒ లుక్కు వేసాడట. ఆయనకు బాగా కోపం వచ్చిందని అర్థం అయిన రకుల్.. మళ్ళి బాలయ్యతో సినిమా చేస్తే అలాంటి సందర్భమే రావచ్చు. అసలే ఆయనకు కోపం ఎక్కువ. ఆయన నన్ను కొట్టిన కొడతారు అనే భయంతోనే ఆ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.