విక్టరీ వెంకటేష్.. మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. 2023లో ఫ్యామిలీ డ్రామా ఫిలిం గా రూపొందిన ఏ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మిక్కీ జే. మేయర్ కంపోజ్ చేయగా అనంత శ్రీరామ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు ఆలపించారు. ఎవర్‌గ్రీన్ హిట్స్‌గా ఈ సినిమాలో ప్రతిపాట నిలిచిపోయింది. అయితే ఈ సినిమాల్లో సమంత, అంజలి హీరోయిన్గా నటించి మెప్పించారు. కాగా ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల క్యారెక్టర్ల కంటే ఎక్కువగా హిట్ అయిన క్యారెక్టర్ రేలంగి మావయ్య. టాలెంటెడ్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఈ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు.
ఇప్పటికీ పలు మీన్స్ లో కూడా రేలంగి మామయ్యను తెగ వాడేస్తున్నారు. రాముడు మంచి బాలుడు లాంటి క్యారెక్టర్‌లో రేలంగి మామయ్య పాత్రను డిజైన్ చేశారు. అందర్నీ ఆప్యాయంగా పలకరించడం.. వీలైనంతగా మంచి చేయడం.. పిల్లలను వారికి నచ్చినట్లు పెరగనివ్వడం తప్ప.. చెడు చేయడం ఈ పాత్రకు అసలు తెలియదు. అయితే మొదట ఇంత మంచి క్యారెక్టర్ ప్రకాష్ రాజుకు రాలేదట. ఈ పాత్ర సూపర్ స్టార్ రజినీకాంత్ పర్ఫెక్ట్ గా సూటవుతాడని శ్రీకాంత్ అద్దాల అనుకున్నారు. దీంతో మొదట రజనీకాంత్ ను అప్రోచ్ అయ్యి 40 నిమిషాల పాటు రజని కి స్టోరీ వినిపించారట. తర్వాత సాటి మనిషిని చూడగానే నవ్వుతూ ముందుకు వెళ్లిపోయే ఒక మంచి క్యారెక్టర్‌కు నన్నే ఎందుకు తీసుకోవాలనుకున్నావు అని రజనీకాంత్ ప్రశ్నించాడట.. దానికి శ్రీకాంత్ మాట్లాడుతూ సార్ ఈ క్యారెక్టర్ రిక్షావాడి నుంచి కోటీశ్వరుడి వరకు ప్రతి ఒక్కరికి కనెక్ట్ కావాలి.
మీరు చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. అందుకే మీ వద్దకి వచ్చా అని వివరించాడట. రజనీకాంత్ కి క్యారెక్టర్ బాగా నచ్చేసిందట కానీ.. ఆ టైంలో తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు కారణంగా షూటింగ్‌లు ఎక్కువ పాల్గొనలేనని సున్నితంగా ఆ పాత్ర రిజెక్ట్ చేశాడట. ఇక రజిని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి క్యారెక్టర్ లో అయినా అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకోగల సత్తా ఆయనకు ఉంది. ఈ క్రమంలోనే క్యారెక్టర్ లో రజనీకాంత్ చేసి ఉంటే సినిమాకు మరింత హైలెట్గా ఉండేదని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో తన క్యారెక్టర్ కు న్యాయం చేశారని.. ఆయన నటన అద్భుతంగా ఉందంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.