దక్షిణ ఇండస్ట్రీలో తన నటనతో, అందంతో ప్రేక్షకులను మెప్పించింది హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. ఈ మలయాళ సోయగం మొదటి మెడిసిన్ పూర్తిచేసి తర్వాత నటనపై ఉన్న ఇంట్రెస్ట్‌తో మొడలింగ్ రంగంలో అడుగుపెట్టి మెల్లగా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంది. అలా ఈ ముద్దుగుమ్మ 2017లో మాయ నది మూవీతో మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదట సినిమాతోనే నటిగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తరువాత 2019లో యాక్షన్ మూవీతో కోలీవుడ్ లో అడుగు పెట్టింది.
ఇక ఈ సినిమా తర్వాత విష్ణు విశాల్ తో కలిసి నటించిన మట్టి కుస్తి సినిమాతో భారీ పాపులారిటి దక్కించుకుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇక డైరెక్టర్ మణిశర్మ పొనియన్ సెల్వన్ సినిమాలోని కీలక పాత్రలో నటించే అవకాశాని కొట్టేసింది. ఇక ఈ మూవీలో తన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా.. నటనకు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలను ఎంచుకుంటున్న నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో ఎంతో మంది ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటున్నా ఐశ్వర్య లక్ష్మి.. తాజాగా మెగా హీరో సినిమాలో నటించే క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. అతను మరెవరో కాదు సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్. తన 18వ సినిమాగా రూపొందుతున్న ప్రాజెక్టులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించినుంది. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాల అమ్మడు వసంత పాత్రలో ఆడియన్స్ కు కనిపించనుంది. ఈ క్రమంలో సినిమా నుంచి ఇటీవల అమ్మడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ మారుతుంది.