రాజ్ తరుణ్ బ్రాహ్మిణ్, నేను చౌదరి.. పెళ్లి కాకుంటే అవెందుకు కొంటాడు..?

హీరో రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారంలోఎప్ప‌టినుంచో సాగుతున్న సంగ‌తి తెలిసిందే. పోలీసులు చార్జ్‌ షీట్‌ దాఖలు చేసి.. అందులో తాజాగా రాజ్ త‌రుణ్‌ని నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇటీవ‌ల ఓ మీడియా సంస్థ‌తో లావణ్య రియాక్ట్ అయింది. పెళ్లికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని ఇంటర్వ్యూ ర్‌ అడిగిన ప్రశ్నకు.. నేను చౌదరి అమ్మాయిని, రాజ్ తరుణ బ్రాహ్మణ అబ్బాయి. మేము తెలిసి తెలియని వయస్సులో ప్రేమ వివాహం చేసుకున్నం.

I Want Raj Tarun, He's My World, Says Actor's Rumored GF

మావి వేరు వేరు క్యాస్ట్ లు కావ‌డంతో మా పేరెంట్స్ ఒప్పుకోరు అనే ఉద్దేశంతోనే చిన్నవయసులో వారికి తెలియకుండా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న మూడో నెలలో రెండు కుటుంబాలకు విషయాన్ని చెప్పడం.. వాళ్ళు అంగ‌క‌రించ‌డంతో అప్పటినుంచి ఇప్పటివరకు మా రెండు కుటుంబాలు కలిసే ఉంటున్నాయి. ఇక ఇటీవల నేను అమెరికాకు వెళ్లే సమయంలో కూడా రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు వచ్చి నన్ను ఫ్లైట్ ఎక్కించారు. ఈ అమ్మాయికి బ్యాగ్రౌండ్ లేదు కాబట్టి డ్రగ్స్ కేసు పెట్టి మోసం చెయొచ్చు అని భావించారు. కానీ నేను ఇప్పుడు దానిపై పోరాడుతున్న.

Raj Tarun Issue: Lavanya Attempted Suicide

అయితే పెళ్లికి ఉన్న ఆధారాలు ఏంటి అని అడిగితే మూడో వ్యక్తికే తెలియకూడదని మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం. కనీసం ఇంకో వ్యక్తి ఉంటే మా పెళ్లి ఫోటోలైన తీసేవారు. అదే రాజ్‌తరుణ్ కట్టిన తాలితో మేము సెల్ఫీలు తీసుకున్నాం. అలాగే రాజ్ తరుణ్ డబ్బుతోనే ఆ తాళిబొట్టు కొన్నాడు అంటూ ఆమె వివరించింది. పెళ్లి కాకపోతే రాజ్ త‌న అకౌంట్ లో నుంచి డబ్బులు తీసి.. నాకు అవి ఎందుకు కొన్నాడు.. అంటూ ఆమె ప్రశ్నించింది. పెళ్లయిందని ప్రూవ్ చేసుకోవాలా.. అయిందని ఉద్దేశంతోనే కదా 11 ఏళ్లు కాపురం చేశా. అది కూడా నేను త్వరలోనే కోర్ట్‌లో ప్రూవ్ చేసుకుంటా అంటూ ఆమె వివరించింది. ప్రస్తుతం లావణ్య వారి పెళ్లి పై, తాళిబొట్టుపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.