సినిమా అంటే సాధారణ విషయం కాదు. ఓ సినిమా సక్సెస్ కావాలంటే ఎంతోమంది కష్టపడాల్సి ఉంటుంది. నటినటులు, దర్శకులే కాదు.. వందలాది మంది శ్రమ సినిమా వెనుక ఉంటుంది. అంతకంటే ఎక్కువగా నిర్మాత సినిమా విషయంలో కీలక పాత్ర పోషిస్తాడు. సినిమా బాగా రావాలంటే.. ఖర్చులో వెనకాడని, రాజీపడని ప్రొడ్యూసర్ ఉండాలి. సినీ ఇండస్ట్రీలో నటీనటులుగా, దర్శకులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం కష్టతరమైన పని. అయినా ఒకసారి సక్సెస్ వస్తే.. సెలబ్రిటీలుగా వారికి ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. ఇక సెలబ్రిటీ కిడ్స్‌గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వారికి స్టార్డం రావడం పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. అయితే గత కొద్దిరోజులుగా యంగ్ ప్రొడ్యూసర్లుగా సత్తా చాటెందుకు నిర్మాణరంగంలోకి వరుసరాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు. యంగ్ ప్రొడ్యూసర్లుగా తమ సత్తా చాటుకుంటున్నారు. అలా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తమ సత్తా చాటుతున్న యంగ్ ప్రొడ్యూసర్లు ఎవరో ఒకసారి చూద్దాం.
నందమూరి ఫ్యామిలీ
టాలీవుడ్ నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ యంగ్ హీరోలతో గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలో నటిస్తూ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడో తెలిసిందే. ఆయన నట వారసుడిగా.. మోక్షజ్ఞను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య చిన్న కుమార్తె తేజస్వి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది. మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఆమె ప్రొడ్యూసర్ గా వ్యవహరించనుంది. లెజెండ్ ప్రొడక్షన్స్ పై ఆమె ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
మెగా ఫ్యామిలీ
మెగా వారసులుగా ఇప్పటికే ఆ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వారిలో పలువురు ప్రపంచ స్థాయి హీరోలుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి నిర్మాణ రంగంలో సత్తా చాటేందుకు మెగా ఫ్యామిలీ వారసురాలు కూడా సిద్ధమయ్యారు. నాగబాబు కుమార్తె నిహారిక పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై ఇటీవల కమిటీ కుర్రాళ్ళు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల.. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థను స్థాపించి మొదటి సినిమా తన తండ్రితో తినున్నట్లు గతంలో అనౌన్స్ చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
అశ్వినీ దత్ ఫ్యామిలీ
టాలీవుడ్ లో వైజయంతి మూవీస్‌కు ఎలాంటి క్రేజ్ ఉందా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ నిర్మాణ సంస్థ.. ఎన్నో బ్లాక్ బస్టర్ హీట్ సినిమాలను నిర్మించింది. ఇక గత కొద్ది కాలంగా అశ్విని దత్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం.. ఆయన కుమార్తె స్వప్న దత్త్, ప్రియాంక దత్త్‌లు ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టారు. తాజాగా కల్కి 2898 ఏడి తో ప్రపంచ స్థాయిలో ఇద్దరు ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మరిన్ని సినిమాలకు వీరు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించనున్నారు. వీరు మాత్రమే కాదు.. కృష్ణంరాజు కుమార్తె ప్రసిద్ధ ఉప్పలపాటి కూడా నిర్మాతగా మారింది. ప్రభాస్ హీరోగా నటించిన రాదేశ్యాం సినిమాకి నిర్మాతగా వ్యవహరించింది. అలాగే కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని కూడా ప్రొడ్యూసర్ గా పలు సినిమాలను రూపొందించారు. ఇంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై షో, నాని, పోకిరి, ఏ మాయ చేసావే లాంటి సినిమాలకు ఈ అమ్మడు ప్రొడ్యూసర్ గా చేసింది.