టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన సినిమాలే ఆయన్ని ఆ రేంజ్ లో నిలబెట్టాయి. నిజానికి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్.. అతితక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. పవర్ స్టార్ గా ఓ స్టేటస్ ను దక్కించుకున్నాడు. తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న పవన్ గురించి ఎంత పొగడినా తక్కువే.
ప్రస్తుతం పాలిటిక్స్ లో తన సత్తా చాటుతున్న పవర్ స్టార్.. సినిమాల విషయంలోనూ జాగ్రత్తలు వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే సెట్స్‌పై మూడు సినిమాలను పెండింగ్లో ఉంచారు పవన్ కళ్యాణ్. వాటిని పూర్తి చేసి మరో సినిమాకు కూడా కమిట్ అవ్వాలని ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే భీమ్లా నాయక్ తో మంచి సక్సెస్ అందుకున్న పవన్.. మరోసారి సాగర్ కే చంద్ర డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ బాక్‌గ్రౌండ్ స్క్రిప్ట్ తీసుకురమ్మని చెప్పాడట. ఇక పవన్ అలాంటి కథ దొరికితే సినిమా చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం.
కాగా ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఈ సినిమాలను వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలని భావిస్తున్న పవర్ స్టార్.. సినిమా కోసం చాలా తక్కువ టైం కేటాయించాలని ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమాలతో తన అభిమానులను అలరించాలని ఫిక్స్ అయ్యాడట పవర్ స్టార్. తర్వాత సినిమాలు చేస్తాడా.. లేదా అని విషయంపై క్లారిటీ లేకున్నా.. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న సినిమాలను మాత్రం ఎలాగైనా పూర్తి చేసి ఫ్యాన్స్‌ను ఖుషి చేయాలని భావిస్తున్నాడట పవర్ స్టార్. ఇక ప్రస్తుతం పవన్ నుంచి ఒక సినిమా వస్తే చాలు.. టాక్ తో సంబంధం లేకుండా సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుంది అనడంలో సందేహం లేదు.