నందమూరి నరసింహ బాలయ్యకు ముక్కుపై కోపం అని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో బయటపడింది. పలు సందర్భంగా ఫ్యాన్స్ పై కూడా బాలయ్య చెయ్యి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే అయినా ఎన్ని విధాలుగా దురుసు మాటలు మాట్లాడిన కూడా ఫ్యాన్స్ ఎప్పుడూ ఆయను అభిమానిస్తూనే ఉంటారు. ఇష్టపడుతూనే ఉంటారు. బాలయ్యకు కోపం ఎక్కువ అని సన్నిహితులు చెప్తూ ఉంటారు. అయితే అంతే ప్రేమ కూడా ఉంటుందని అందరికీ తెలుసు. అందుకే ఆయన కోపంతో ఫ్యాన్స్ ను నెట్టేసిన.. వాళ్ళు దాన్ని ప్రేమగానే తీసుకుంటారు. ఎటువంటి విమర్శలు చేయరు.
అయితే అలాంటి స్టార్ హీరో బాలకృష్ణ ఇటీవల తన 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నందుకు స్వర్ణోత్సవాలు జరిగాయి. ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలు కలిసి ఈయనకు గ్రాండ్ లెవెల్లో సన్మానం చేశారు. ఈవెంట్ కి ఎంతోమంది అతిరథ మహారధులు విచ్చేసి వేడుకను మరింత సక్సెస్ చేశారు. అయితే ఈ క్రమంలో బాలయ్య మాట్లాడిన ఓ వీడియో నెటింట తెగ వైరల్ గా మారింది. బాలకృష్ణ ఎప్పుడు ఏదో సందర్భంలో మాట్లాడిన వీడియోలు చక్కరలు కొడుతూనే ఉంటాయి. అలా ట్విట్టర్‌లో బాలకృష్ణ మాట్లాడిన ఓ వీడియో వైరల్ గా మారుతుంది.
ఈ వీడియోలో బాలయ్య మాట్లాడుతూ ఇంకోసారి తెలుగు ఇండస్ట్రీలో దర్శకులు లేరంటే వాళ్ళ పళ్ళు రాలగొడతా.. మన తెలుగులో డైరెక్టర్స్ లేరా.. సాంకేతిక నిపుణులు, నిర్మాతలు లేరా, హీరోలు లేరా.. తెలుగు ఇండస్ట్రీని తక్కువ ఎందుకు చేయాలి.. నేను చేసిన భైరవద్వీపం, ఆదిత్య 369 సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో తెలియదా.. ఆ సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఇంకోసారి ఎవరైనా తెలుగులో దర్శకులు లేకపోవడం దురదృష్టకరం.. దర్శకులు లేకపోవడం బ్యాడ్ లక్ అని నా ముందు అంటే అసలు సహించను. ఆ మాటలు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాఖ్యానించండి అంటూ ఫుల్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం బాలయ్య వార్నింగ్ ఇచ్చిన ఈ వీడియో నెటింట తెగ వైరల్ అవుతుంది.