అక్కడ పట్టుకుని నొక్కేసింది.. విపరీతమైన నొప్పి.. వృద్ధురాలు అసభ్యకర ప్రవర్తనపై దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్..

సీతారామం తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. తెలుగుతో పాటు వివిధ భాషల‌లో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయ‌న‌.. విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న దుల్కర్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు. యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ వృద్ధురాలు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనతో జరిగిన ఓ చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. అలాగే దుల్కర్‌ను మీకు ఈ భారీ ఫాన్ ఫాలోయింగ్ ఉండడానికి కారణం ఏంటి అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఆయన రియాక్ట్ అవుతూ ఓ కాద‌ల్ కాణ్మని లేదా సీతారామం సినిమాల నుంచి నాకు లేడీ ప్లాన్ ఫాలోయింగ్ పెరిగింది అని అనుకుంటున్నా అంటూ వివ‌రించాడు.

Dulquer Salmaan: అందుకే సినిమాల్లోకి రావడానికి భయపడ్డా: దుల్కర్‌ సల్మాన్‌ |  dulquer-salmaan-speaks-about-his-fear-before-getting-into-films

అయితే కేరళాలో సాలిడ్ బాయ్స్ ఫ్యాన్‌ ఫాలోయింగ్ కూడా ఉందంటూ చెప్పుకొచ్చాడు. అసలు నేనెవరో ప్రజలకు తెలుసు. వారితో నాకు కనెక్షన్ ఉంటుంది. ఆంటీలలా కాకుండా.. కాస్త పెద్ద వాళ్ళతో, వృద్ధులతో ఫోటోలు దిగే టైంలో నాకు వింత సంభాషణలు ఎదురవుతూ ఉంటాయి. ఆ టైంలోనే సడన్ గా నా బుగ్గ గిల్లడం, బుగ్గ పై ముద్దు పెట్టడం లాంటివి వాళ్ళు చేస్తూ ఉంటారు. అది సముచితం కాదు. కానీ.. అవి స్వీట్‌గా నాకు అనిపిస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగా ఇంటర్వ్యువర్ మీ బ్యాక్ సైడ్ ఎవరైనా టచ్ చేసారా అని అడగగా.. దానికి అవును. మళ్ళీ ఓ వృద్ధ మహిళే అంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకో నాకు తెలియదు అది చాలా ఇబ్బందికరంగా, విచిత్రంగా అనిపించింది. భ‌రించలేని నొప్పి కలిగింది. ఒక వృద్ధ మహిళ నా పిరుదలు పట్టుకుని గట్టిగా నొక్కేసింది.

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ నెక్ట్స్ సినిమా స్టోరీ ఇదేనా.. మాములుగా  లేదుగా కథ.. - Telugu News | Malayalam Star Hero Dulquer Salmaan Next Movie  Latest Update | TV9 Telugu

అదేదో క్యాజువల్ గా పట్టుకున్నట్టు లేదు.. ఆమె వయసులోనూ చాలా పెద్దది ఆమె పట్టుకోవడంలో ఉన్న అర్థం నాకు తెలియలేదు అంటూ దుల్కర్ సల్మాన్ వివరించాడు. బయటకు వెళ్ళినప్పుడు ఆంటీలు, వృద్ధ మ‌హిళ‌లు ఫోటోలు దిగాలని ఎగబడుతుంటారు. ఒక సమయంలో వాళ్ళు చేయి వెనక్కి పెట్టినప్పుడు పిరుద‌లకు టచ్ అవుతూ ఉంటుంది. కానీ ఇది అలా కాకుండా.. కాస్త ఇబ్బంద‌గా అనిపించింది. దీంతో ఆంటీ మీరు కాస్త అక్కడికి వెళ్లి నుంచోమ‌ని అడిగా. అది అప్పట్లో నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఇప్పుడు పూర్తిగా మర్చిపోయా అంటూ దుల్కర్ సల్మాన్‌ తన లైఫ్ లో జరిగిన చేదు అనుభవాన్ని వివరించాడు.