రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ మొదలైన చోటే ముగియనుందా.. దేవర బ్లాక్ బస్టర్ పక్క అంటూ..

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ప్రాబ్లం ఎదుర్కొంటారనే బ్యాడ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో కొనసాగుతుంది, ఇక ఈ బ్యాడ్ సెంటిమెంట్‌ను ఇప్పటికే ఎన్టీఆర్ నుంచి ప్రభాస్, రామ్ చరణ్ వ‌ర‌కు వరుసగా ఎంతోమంది ఫేస్ చేశారు. మొదట రాజమౌళితో సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న తర్వాత.. ఫ్లాప్ లను చెవి చూశారు. ఇక ప్రస్తుతం తారక్ నుంచి దేవర సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు టెన‌ష‌న్‌ మొదలైంది. ఆర్‌ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. సోలోగా ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సినిమా రిలీజ్ అవుతుంది. ఇక ఆర్‌ఆర్ఆర్ త‌ర్వ‌త‌ ఎన్టీఆర్ నటించిన ఈ దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటే.. రాజమౌళితో సినిమా తర్వాత హిట్ కొట్టిన మొట్టమొదటి తెలుగు హీరోగా రికార్డ్ సృష్టిస్తాడు తారక్.

Jr NTR : రామాయణం టూ RRR వరకు ఎన్టీఆర్ సినీ కెరీర్‌‌లో ఏయే సినిమాలు ఎంత  వసూళ్లు రాబట్టాయంటే – News18 తెలుగు

ఇక విస్త‌వానికి ఈ బ్యాడ్‌ సెంటిమెంట్ మొదలైంది కూడా తారక్ నుంచే. 2001లో రాజమౌళి డైరెక్షన్లో వ‌చ్చి స్టూడెంట్ నెం.1 సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఇది ఎన్టీఆర్‌కు రెండో సినిమా. రాజమౌళికి మొదటి సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన సుబ్బు యావరేజ్, అలాగే రాజమౌళి చేసిన రెండో సినిమా సింహాద్రి బ్లాక్ బస్టర్. తర్వాత వరుసగా తార‌క్‌కు డిజాస్టర్స్. ఇలా ఎన్టీఆర్ ఫ్లాప్ ల పైన ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. అప్పటినుంచి రాజమౌళి మూవీతో బ్యాడ్ సెంటిమెంట్ పెరిగింది. ఇక‌ ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత కూడా తారక్‌దే అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Devara” second song with this kind of visuals..interesting details –  PakkaFilmy

ఈ బ్యాడ్ సెంటిమెంట్ మొదటి అడుగు పడిన స్టూడెంట్ నెం.1 మూవీ రిలీజ్ అయిన రోజే దేవర సినిమా రిలీజ్ అవుతుండడంతో.. ఇప్పుడు ఈ వార్త నెటింట చర్చనీయాంసంగా మారింది. కే. రాఘవేంద్రరావు డైరెక్షన్లో రాజమౌళి తెర‌కెక్కించిన‌ స్టూడెంట్ నెం.1.. 2001 సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. మళ్ళీ 23 ఏళ్ల తర్వాత ఇదే సెప్టెంబర్ 27న దేవ‌ర రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇక దీంతో రాజమౌళి సెంటిమెంట్ మొదలైన చోటే.. మొదలైన హీరోతోనే దానికి ఎండ్ కార్డు పడాలని కోరుకుంటున్నారు టాలీవుడ్ అభిమానులు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా తారక్ బ్లాక్ బస్టర్ కొట్టాలంటూ.. దేవ‌ర‌ బ్లాక్ బస్టర్ కొట్టడం కాయం.. టాలీవుడ్ సక్సెస్ పక్కా అంటూ.. తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. కాగా.. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన మూడు పాటలు మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు కొద్ది సేప‌ట్లో ఈ సినిమా నుంచి అయ్యుద్ధ‌ పూజా సాంగ్ రిలీజ్ కానుంది.