బాలయ్య హర హర మహాదేవ మూవీ ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

నందమూరి నటసింహం బాలకృష్ణకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల్లో టాప్ హీరోగా దూసుకుపోతున్న బాలయ్య.. ఓ పక్కన వరుస‌ సినిమాలలో బిజీగా గడుపుతూనే.. మరో పక్క రాజకీయాల్లోనూ రాణిస్తున్నాడు. ఇక బాల‌య్య సినీ కెరీర్‌లో అయ‌న‌కు ఎంతో మంది డైరెక్టర్స్ తమ సినిమాలతో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ ఒకరు. బాలయ్య, బి గోపాల్ కాంబోలో ఇప్పటికే ఎన్నో సినిమాలు తెర‌కెక్కి బ్లాక్ బాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. మొదట వీరి కాంబోలో తెరకెక్కిన లారీ డ్రైవర్ మంచి సక్సెస్ అందుకుంది.

B Gopal Again Start Direction - Telugu Bulletin

ఈ సినిమా తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ రిలీజై బ్లాక్ బాస్టర్ అయింది. అలా వీరి కాంబోలో తెరకెక్కిన మూడ‌వ సినిమా సమరసింహారెడ్డి. ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఈ మూవీటాలీవుడ్ ఇండస్ట్రియల్ హిట్గా నిలిచింది. ఇక వీరి కాంబోలో వచ్చిన నాలుగ‌వ మూవీ నరసింహనాయుడు కూడా ఇండస్ట్రియల్ హిట్ గా నిలవడం విశేషం. అయితే వీరి కాంబోలో తెర‌కెక్కిన ఐదోవ‌ మూవీ పల్నాటి బ్రహ్మనాయుడు మాత్రం అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే.. బాలయ్య హీరోగా బి.గోపాల్ డైరెక్షన్‌లో కొన్ని సంవత్సరాల క్రితం హర హర మహాదేవ అనే టైటిల్‌తో మరో సినిమా మొదలుపెట్టినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. పోస్టర్ కూడా సినిమా నుంచి రిలీజ్ చేశారు. కానీ.. సినిమా సెట్స్ పైకి రాకముందే ఎండ్ కార్డ్‌ పడిపోయింది.

Hara Hara Mahadeva | Telugu Movie | Movie Reviews, Showtimes | nowrunning

ఇక తాజాగా బి.గోపాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా ఆగిపోవడానికి గల కారణాన్ని వివరించాడు. బి. గోపాల్ రియాక్ట్ అవుతూ.. బాలయ్యతో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యా.. కానీ కథ మాత్రం సిద్ధంగా లేదు. ఈ క్రమంలో బెల్లంకొండ సురేష్ సినిమాకు ప్రొడ్యూసర్గా ఉందామనుకున్నాడు.. ఆయనే ఒక కథ ఉంది దానితో సినిమా చేయండి అని వివరించాడు. ఇక ఆ కథకు హరహరమహాదేవ అనే టైటిల్ ఫిక్స్ చేసాం. కానీ.. తర్వాత అతను ఆ స్టోరీ వినిపించకుండా చిన్నికృష్ణ దగ్గర ఓ స్టోరీ ఉంది అని చెప్పాడు. దాన్ని కూడా విన్నం. అది కూడా పెద్దగా సెట్ కాలేదు. దీంతో సరైన కథే లేనప్పుడు సినిమా ఎలా తీస్తామని.. హరిహర మహాదేవ సినిమాను ఆపేయవలసి వచ్చింది అంటూ బి గోపాల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బి..గోపాల్ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి.