బుల్లితెర యాంకర్ శ్రీముఖికి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక అవసరము లేదు. హీరోయిన్ అవాలని ఆశతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడికి అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో పటాస్ కామెడీ షో లో యాంకర్ గా అవకాశాన్ని దక్కించుకుంది శ్రీముఖి. ఈ షోలో తన యాంకరింగ్, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది. అంతేకాదు ఈ షోలో చేస్తున్న క్రమంలోనే అమ్మడికి పలు సినిమాల్లో కీలకపాత్రలో నటించే అవకాశం వచ్చింది. అలా పలు సినిమాల్లో నటిస్తూనే పలు షోలకు యాంకర్ గాను వ్యవహరిస్తున్న ఈ ముద్దుగుమ్మకు అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొనే అవకాశం రావడం.. దీంతో బిగ్‌బాస్ పాల్గొని తన ఆటతో సత్తా చాటుకుంది.
ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కి విపరీతమైన పోటీ ఇచ్చి.. టాప్ 2లో నిలిచింది. ఇక ఈ అమ్మడు ఈ షోలో పాల్గొన్నందుకు భారీగానే రెమ్యూనరేషన్‌కూడా అందిందట. ఇక ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీముఖికి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. యాంకర్ గా రాణిస్తూనే.. వెండితెరపై కూడా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. క్రేజీ అంకుల్ సినిమాలో హీరోయిన్గా ఆకట్టుకుంది. అయితే తర్వాత హీరోయిన్గా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేకపోయింది. ఈ క్రమంలోనే యాంకరింగ్ చేస్తూ, కీలకపాత్రలో నటిస్తున్న శ్రీముఖి యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి భారీగానే సంపాదిస్తుంది. ఎంతో ముద్దుగా, బొద్దుగా, చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మకు ఫాలోవర్స్ కూడా గట్టిగానే ఉన్నారు.
ఇక ఎప్పటికప్పుడు శ్రీముఖి తన ఫోటో షూట్లతో ఫ్యాన్స్‌ను కవిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా శ్రీముఖికి సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. ఈ ముద్దుగుమ్మ ఓ టాలీవుడ్ యాక్టర్‌తో ఎఫైర్ పెట్టుకుందట. అయితే ఎవో కారణాలతో.. ఈ అమ్మడు అతనితో విడిపోయింది. ఆ కారణంగానే ఇప్పటివరకు శ్రీముఖి వివాహం చేసుకోలేదని.. ఇతర వేరే వారితో కమిట్ అవ్వడం ఇష్టం లేక అలా ఉండిపోయిందని తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఏంటో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్తలు నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి.