త్వరలోనే చిరు – బాలయ్య మల్టీస్టారర్.. గెట్ రెడీ అంటున్న ఆ ఇద్దరూ డైరెక్టర్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి, మెగా హీరోలు.. బాలయ్య , చిరంజీవికి ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరు కూడా కెరీర్‌లో ఎక్కువగా.. మాస్, కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సీనియర్ స్టార్ హీరోల్లో మాస్ హీరోలు ఎవరు అంటే టక్కున‌ బాలయ్య, చిరు పేర్లే గుర్తుకు వస్తాయి. ఈ క్రమంలోనే ఇద్దరు హీరోల అభిమానులు చాలామంది వీరిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ లో నటిస్తే బాగుంటుందంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే కొన్ని రోజుల క్రితమే బాలయ్య సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో.. స్వర్ణోత్సవాలు గ్రాండ్ లెవెల్లో జరిగాయి.

బోయపాటి పవర్ఫుల్ లైన్ అప్.. హీరోలు ఎవరంటే.. | Boyapati Srinu Powerful Line  up

ఈ ఈవెంట్లో చిరంజీవి కూడా పాల్గొని సందడి చేశాడు. ఇందులో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ.. బాలకృష్ణతో కలిసి ఓ సినిమాలో నటించాలని ఉందని.. ఎవరైనా మంచి కథతో వస్తే కచ్చితంగా ఇద్దరం కలిసి నటిస్తామంటూ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఇలా స్టేట్మెంట్ ఇవ్వడమే ఆలస్యం.. చాలా మంది దర్శకులు వీరిద్దరి కాంబోలో భారీ మల్టీ స్టార‌ర్‌ ప్లాన్ చేయడానికి రెడీ అయిపోయారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన మాస్ దర్శకులు అయినా బోయపాటి శ్రీను, హరిష్ శంకర్ లాంటి దర్శకులు.. వీరిద్దరి కాంబోలో భారీ మల్టీస్టారర్‌ తీయాలని కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని సెట్ అయిపోతే.. ఇద్దరు స్టార్ డైరెక్టర్‌లు బాలయ్య, చిరుకి కథ వినిపించడానికి రెడీ అవుతున్నారట.

Director Harish Shankar launches a podcast | Telugu Movie News - Times of  India

ఇకపోతే బోయపాటి.. బాలకృష్ణకు ఉన్న ర్యాపో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు తెర‌కెక్కిన అన్ని సినిమాలు బ్లాక్ బ‌స్టర్‌గానే నిలిచాయి. అయితే చిరంజీవితో మాత్రం బోయపాటి ఒక సినిమాను కూడా తెర‌కెక్కించలేదు. ఇక హరీష్ శంకర్ విషయానికి వస్తే బాలయ్య, చిరంజీవి ఇద్దరితోను ఇప్పటివరకు సినిమా తీయలేదు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు డైరెక్టర్స్ లో చిరు, బాలయ్య మల్టీస్టారర్ తీసే అవకాశం ఎవరికీ వస్తుందని ఆసక్తి అభిమానుల్లో మొదలైపోయింది. ఈ క్రమంలోనే అతి త్వరలో బాలయ్య, చిరు మల్టీస్టారర్ సినిమా ఇద్దరి దర్శకుల్లో ఎవరో ఒకరు త్వరలోనే తెరకెక్కించనున్నారంటూ వార్తలు నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి.