సర్వేపల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా మెడల్ అందుకున్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..?

సర్వేపల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా మెడల్ అందుకున్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..?

భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు పురస్కరించుకుంటూ.. ఎటా సెప్టెంబర్ 5న ప్రతి పాఠశాలలో టీచర్స్ డే ను గ్రాండ్ లెవెల్ లో జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. అందరూ తమ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వారికి తమ వంతుగా బహుమానం ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజా టీచర్స్ డే సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ కు సంబంధించిన ఓ పాత ఫోటో నెటింట తెగ వైరల్ గా మారింది. అయితే అందులో సర్వేపల్లి రాధాకృష్ణన్ తో పాటు స్టార్ నటుడు కూడా ఉండడం విశేషం. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ అబ్బాయి.. ఇప్పుడు భారతదేశ తలెత్తుకుని చూసేలా గొప్ప నటుడిగా నిలిచాడు. ఎన్నో వందల సినిమాల్లో త‌న అద్భుత నటనతో ఆడియ‌న్స్‌ను ఆకట్టుకున్నాడు.

Bharateeyudu 2 (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే కేవలం దక్షిణాదిలోనే కాదు.. ఈయన నటనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కథ‌ ఏదైనా.. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి మరి నటించే ఈ నటుడు ప్రస్తుతం విశ్వ నటుడుగా ప్రపంచవ్యాప్తమైన పాపులారిటీతో దూసుకుపోతూ.. వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. విశ్వనటుడు అనగానే ఇప్పటికే ఈ హీరో ఎవరో అర్థం అయిపోయి ఉంటుంది. ఎస్ మీ గెస్ కరెక్టే. ఆ పిల్లాడే లోకనాయకుడు కమల్ హాసన్. సర్వేపల్లి జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. క‌మ‌ల్ తన నాలుగేళ్ల వయసులోనే కళాత్తూర్ కండమ్మ అనే సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకున్నాడు. ఇందుకుగాను ఆయనకు రాష్ట్రపతి మెడల్ దక్కింది. దీంతో అప్పటి రాష్ట్రపతిగా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్.. కమల్ హాసన్ ను స్వయంగా బంగారు పతాకంతో పురస్కరించారు.

కల్కి 2989ఏడీ' సినిమా చూశాకా.. మీకూ ఈ డౌట్‌ వచ్చిందా? | Did you get this  doubt after watching the movie Kalki 2989AD

ఇక కమలహాసన్ ఇప్పటికి సినిమాల్లో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పలు సినిమాల్లో కీలక పాత్రలోను నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా కమల్ హాసన్ హీరోగా తెర‌కెక్కిన మూవీ భారతీయుడు 2. ఈ మూవీ బాక్సాఫీస్‌వ‌ద్ద‌ డీలపడిన సంగతి తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నా.. సెకండ్ పార్ట్ మాత్రం మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. ఇక ఈ సినిమాతో పాటే.. కమల్ హాసన్ ఇటీవల నటించిన మరో మూవీ కల్కి.. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాల్లో సుప్రీం అనే నెగటివ్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నాడు కమలహాసన్. ఇక కల్కి రెండో భాగంలో కమలహాసన్ పాత్రనడివి మరింతగా ఉండబోతుందని టాక్.