టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూట్ దాదాపు మూడేళ్లు కంటిన్యూస్‌గా కొనసాగుతుందట. రెండు భాగాలుగా సినిమా తెరకెక్కుతుందని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇక దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కే.ఎల్. నారాయణ ఏకంగా రూ.1500 కోట్ల భారీ బడ్జెట్లో సినిమాను నిర్మించనున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో.. బన్నీ పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబు ఈ సినిమాను మొదట చేయాల్సి ఉంది. కానీ.. బన్నీ నటించిన డి గ్లామర్ పాత్రలో తాను నటిస్తే సినిమాను ఆడియన్స్ చూడరేమో అని ఉద్దేశంతో మహేష్ బాబు ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు గతంలో వార్తలు వినిపించాయి.
ఇక మహర్షి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన కోసం రెండు సంవత్సరాలు ఎదురు చూశాడని.. అన్ని సంవత్సరాలు ఎవరు ఓ హీరో కోసం వెయిట్ చేయరంటే వివరించాడు. అయితే ఆ క్రమంలో పూరి జగన్నాథ్, సుకుమార్ గురించి మాత్రం మహేష్ మాట్లాడలేదంటూ వార్తలు రావడంతో.. తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పరిచి ఇద్దరు దర్శకులపై వస్తున్న వార్తలకు మహేష్ చెక్ పెట్టాడు. వంశీ నా గురించి రెండు సంవత్సరాలు ఎదురు చూశాడని నేను పొగిడా కానీ.. సుకుమార్ ని పాయింట్ అవుట్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే మహేష్ ఇంత ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవడానికి కారణం ఈరోజుల్లో డైరెక్టర్ కనీసం రెండు నెలలు కూడా ఆగలేకపోతున్నారు.. అస్సలు ఓర్పు కూడా ఉండడం లేదంటూ గతంలో ఓ సందర్భంలో చెసిన కామెంట్స్.
సుకుమార్.. పుష్ప సినిమా కథ చెప్పిన టైంలో వేరే సినిమాలో మహేష్ బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి అయిన తర్వాత చేద్దామని సుకుమార్ తో అన్నారట. అయితే అంతవరకు ఆగడం ఇష్టం లేని సుకుమార్.. బన్నీతో సినిమాను రూపొందించాడు. ఈ క్రమంలోనే మహేష్ బాబు.. సుకుమార్ ను ఉద్దేశించే అలా అన్నాడంటూ.. సుకుమార్ కు మహేష్ బాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కాగా తర్వాత మహేష్ బాబు ఈ కామెంట్స్ పై రియాక్ట్ అవుతూ.. సుకుమార్ నాకు మంచి స్నేహితుడు. అందులో అసలు సందేహం లేదు. త్వరలోనే ఆయనతో కలిసి ఓ సినిమాలో నటిస్తా అంటూ చెప్పుకొచ్చాడు. పోకిరి సినిమా తనను సూపర్ స్టార్ ను చేసింది. నేనొక్కడినే కమర్షియల్ సక్సస్ ఇచ్చిన సినిమా అంటూ చెప్పుకొచ్చిన ఆయన.. ఆ రెండు సినిమాల దర్శకులూన పూరి, సుకుమార్‌కు కూడా ధన్యవాదాలు తెలియజేశాడు. అయితే నేను వంశీని పొగడడం వేరే విధంగా పోట్రే చేయొద్దని.. తప్పుగా ఎవరూ భావించవద్దని మహేష్ బాబు గతంలో చేసిన కామెంట్స్ మరోసారి నెటింట వైరల్ గా మారుతున్నాయి.