తమ్ముడు సినీ ఎంట్రీ పై తారక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. వైరల్..!

నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అంటూ వెయ్యి క‌ళ‌తో ఎదురు చూసిన‌ శుభ ముహూర్తం రానే వచ్చేసింది. హనుమాన్ మూవీ తో పాన్ ఇండియన్ మార్కెట్ షేక్‌ చేసిన టాలీవుడ్ డైనమిక్ యంగ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను గ్రాండ్ లెవెల్ లో లాంచ్ చేయనున్నాడు. ది లయన్ కింగ్ లోని ఫోటోను షేర్ చేసిన ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు మోక్షజ్ఞకు పుట్టిన రోజు విషెస్ తెలియజేశారు. మొదటి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్తూ పోస్టులు పెడుతున్న క్రమంలో.. తాజాగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై.. అన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు.

సినీ రంగంలో అడుగుపెడుతున్న తమ్ముడు మోక్షజ్ఞకు అభినందనలు తెలియజేశాడు. సినీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నందుకు అభినందనలు. జీవితంలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభిస్తున్నావు.. నీకు అన్ని దైవిక శక్తులతో పాటు.. తాతగారి ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అంటూ ఎన్టీఆర్ తన ట్విట్టర్ వేదికగా తమ్ముడు మోక్షజ్ఞకు విషెస్ తెలియజేసాడు. అదే టైంలో పుట్టినరోజు విషెస్ కూడా అందజేశాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ లుక్ తో పాటు.. ఎన్టీఆర్ విషెస్ కూడా నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి.

 

ఈ క్రమంలో నందమూరి అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నందమూరి కుటుంబం రెండుగా చీలిపోనుందని.. బాలయ్య ఫ్యామిలీ అంతా ఒకవైపు.. తారక్‌, కళ్యాణ్ రామ్ కుటుంబం అంతా ఓవైపు చీలిపోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి టైంలో నందమూరి ఫ్యాన్స్ కు.. మోక్షజ్ఞ ఎంట్రీ తో పాటు.. ఎన్టీఆర్ ట్విట్ కూడా ఫుల్ ఆనందాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ ట్విట్‌ను నందమూరి అభిమానులు, బాలయ్య ఫ్యాన్స్ తెగ‌ ఎంజాయ్ చేస్తున్నారు. నందమూరి కుటుంబం మళ్లీ ఒకటిగా కలిసిపోయి ఒకే స్టేజిపై కనిపిస్తే చూడాలని ఉంది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.