కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ గొట్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేశారు. దాదాపు 5వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. 1000 కోట్ల వసూళ్లను గోట్ మూవీ దక్కించుకోవడం ఖాయం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందే లాభదాయకంగా మారింది అంటూ.. తాజాగా ప్రొడ్యూసర్ అర్చన కల్పిత వివరించింది. ఇక ఈ సినిమాకు రెమ్యునరేషన్ గా విజయ్.. దాదాపు రూ.200 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అయితే విజయ్ తో పాటు ఈ సినిమాలో నటించిన ఇతర స్టార్ సెలబ్రిటీస్, దర్శకుడు వెంకట ప్రభు రెమ్యునరేషన్ ఎంతో ఒకసారి తెలుసుకుందాం.
వెంకట ప్రభు:
గోట్ సినిమాకు దళపతి విజయ్ తర్వాత హైయస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నది డైరెక్టర్ వెంకట ప్రభు. ఈ సినిమా కోసం ఈయన ఏకంగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. కరోనా టైం లో రజనీకాంత్, ధనుష్ కోసం అని రాసుకున్న కథను అనుకోకుండా విజయ్ దళపతికి చెప్పడం.. ఆయనకు కథ బాగా నచ్చడంతో విజయ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ క్రమంలో ఏజీఎస్ సంస్థ భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించ.
ప్రభుదేవా:
నటుడు, కొరియోగ్రాఫర్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ప్రభుదేవా గోట్ సినిమాల్లో విజయ్ స్నేహితుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు ప్రభుదేవా రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఓ సినిమాకు హీరోగా నటించినందుకు రూ.8 నుంచి రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే ఈయన.. ఓ సహాయ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.
ప్రశాంత్:
90 దశకం లో విజయ దళపతి కంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకొని స్టార్ నటలుగా దూసుకుపోయిన వారిలో ప్రశాంత్ ఒకడు. గత నెలలో రిలీజ్ అయిన అంధగన్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మళ్ళీ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్న ఈయన.. గోట్ సినిమాలో హీరో స్నేహితుడుగా.. ఉన్నతాధికారి పాత్రలో మెప్పించాడు. ఈ సినిమాలో ఆయన పాత్రకు రూ.75 లక్షల రెమ్యూనరేషన్ చార్జ్ చేసినట్లు సమాచారం.
జయరాం:
ఒకప్పుడు మలయాళ స్టార్ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని తమిళ్ లోను పలు సినిమాల్లో నటించిన జయరాం.. వరుసగా సహాయపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తుపాకీ సినిమా తర్వాత మరోసారి గోట్ సినిమాలో విజయ్‌తో కలిసి పని చేశారు. ఈ సినిమా కోసం ఈయన రూ.50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.
అజ్మల్ అమీర్:
ఈయనకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులోను పలు సినిమాల్లో విలన్ పాత్రలో నటించిన ఈయన.. హీరోగాను తమిళ్ సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే మొట్టమొదటిసారి విజయ్ దళపతి తో గోట్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న అజ్మల్.. ఈ సినిమాకు రూ.50 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నాడు.
మైక్ మోహన్:
మొదట్లో పలు సినిమాల్లో నటించిన మైక్ మోహన్.. చాలా కాలం గ్యాప్ తర్వాత హారా సినిమాతో తమిళ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ మోహన్.. గోట్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన రూ.40 లక్షల రెమ్యునరేషన్ చార్జ్ చేసాడట.
స్నేహ:
హోమ్లీ బ్యూటీగా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు చాలా కాలం గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. అయితే తాజాగా విజయ్ దళపతి నటించిన గోట్ సినిమాల్లో స్నేహ ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా కోసం అమ్మడు రూ.30 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తుంది.