హుక్ స్టెప్స్ తో తంగం కష్టాలు.. దేవర డ్యాన్స్ ముందు అమ్మడు తేలిపోయిందిగా..!

మ్యాన్ ఆఫ్‌ మాసస్ ఎన్టీఆర్ తాజా ప్రాజెక్ట్ దేవ‌ర‌.. భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. డైరెక్ట‌ర్ కొర‌టాలా ఈ మూవీని రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయ‌నున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్‌ బ్యానర్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు.. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ. కె ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న దేవర నుంచి ఇప్పటికే ఎన్నో అప్డేట్స్ వచ్చి ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ సినిమా నుంచి ఫైర్ సాంగ్, చూట‌మ‌ల్లే సాంగ్స్ వచ్చి ఎన్టీఆర్ అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్‌ని కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అంతేకాదు సినిమా నుంచి వచ్చిన టీజర్, గ్లింప్స్‌ కూడా ప్రేక్షకులలో సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సినిమా నుంచి థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో పాటు అనిరుధ్‌ రవిచంద్రన్ కూడా సినిమాపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ తన పోస్టులతో ఆడియన్స్ లో ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన థర్డ్ సాంగ్ దావూదీ.. ప్రేక్షకులను ఓ ఊపు ఊపింది. ఎప్పటిలాగే తారక్ ఈ సాంగ్ లో తన డ్యాన్స్‌తో దుమ్ము రేపాడు. తన ఎన‌ర్జ్టిక్ ప‌ర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఎన్టీఆర్.. టాలీవుడ్ లోనే ది బెస్ట్ డ్యాన్సర్‌లో ఒకడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ఈజీగా ఎలాంటి డ్యాన్స్ స్టెప్స్ అయినా అవలీలగా చేసేస్తాడు. పక్కన ఎంత స్టార్ బ్యూటీ ఉన్న‌ ప్రేక్షకులు చూపు ఆటోమేటిక్గా తారక్ డ్యాన్స్ స్టెప్స్ వైపే ఉంటుంది.

ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ దావూది సాంగ్ విషయంలోనూ అదే రిపీట్ అయింది. ఎన్టీఆర్ డ్యాన్స్ చూసి చాలా రోజులైందని ఫుల్ ఖుషి లో ఉన్న తారక్ ఫ్యాన్స్ ఈ సాంగ్ లో తారక్ స్టెప్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ కు టాలీవుడ్ లో అడుగు పెట్టకు ముందే భారీ క్రేజ్ ఏర్పడింది. తారక్ తో సినిమా అవకాశాన్ని దక్కించుకోవడంతో అమ్మడి క్రేజ్ వేరే లెవెల్ కు వెళ్ళింది. ఇక తన నటనతో, డ్యాన్స్ తో ఎలాగైనా ఆడియన్స్‌ని మెప్పించాలని కాసితో ఉన్న జాన్వి కపూర్ సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన సాంగ్ లో ఎన్టీఆర్ తో పోటీపడి స్టెప్స్ వేస్తూ అదరగొట్టింది. అయితే తాజాగా వచ్చిన దావుది సాంగ్ పై ఆడియన్స్ రియాక్ట్ అవుతూ.. ఈ దావూదీ సాంగ్ హుక్ స్టెప్స్ లో ఎన్టీఆర్ తో అమ్మడు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది అంటూ.. దేవ‌ర‌ హుక్స్ స్టెప్స్ ముందు తంగం తేలిపోయింది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానున్న దేవరతో తార‌క్ ఆడియన్స్‌ను ఏ రేంజ్ లో మెప్పిస్తాడు.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడు వేచి చూడాలి.