టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ మెగా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. స్టార్ హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో రాణిస్తున్న చరణ్.. శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తనని తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని.. మరోసారి వెండి తెరపై తన సత్తా చాటుకోవాలని కసితో ఉన్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో ఆసక్తికర విషయాలు నెటింట వైరల్‌గా మారాయి.
అలా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ లో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నాడు అంటూ టాక్ నడుస్తుంది. అంతేకాదు ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో వెయ్యికోట్ల కలెక్షన్లు కోల్లగొట్టి నార్త్ బెల్ట్ లో రికార్డ్ సృష్టించిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా ఈ సినిమాలో గెస్ట్ అపీరియన్స్ ఇవ్వనున్నాడట. ఈ వార్త నెటింట వైరల్ అవ్వడంతో చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో గెస్ట్ అపీరియన్స్ అంటే నార్త్ బెల్ట్ లోను సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయి. సినిమా బ్లాక్ బస్టర్ పక్క అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇటీవల కాలంలో షారుఖ్ ఖాన్, చరణ్ చాలా సన్నిహితంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షారుక్‌ను తన సినిమాలో నటించాలని చరణ్ కోరినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాతో సక్సెస్ అందుకుని బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటేందుకు చరణ్ సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే తండ్రికి మించిన తనయుడిగా పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చరణ్.. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడో వేచి చూడాలి.