సినీ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలకు విక్రమ్ కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచాడు. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రయోగాత్మక సినిమాలను నటిస్తూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విక్రమ్.. ఈసారి మరో ప్రయోగాత్మక.. అద్భుతమైన డిగ్లామరస్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేడు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తంగలాన్‌ను గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా చూసిన ఆడియన్స్..ట్విట్టర్‌లో సినిమా రివ్యూ అందించారు. ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. కబాలి, సార్పటాస్ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ తంగలాన్ తెరకెక్కింది. ఇక ఈ మూవీపై ప్రేక్షకులో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కారణం విక్రమ్ అన్నింటికంటే ఈ సినిమాలో చాలా వైవిధ్యంగా కనిపించనున్నాడు. ఈ క్రమంలో.. నేడు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ రివ్యూ ఇచ్చారు. ఏ విధంగా ఉందో ట్విట్టర్లో వారిని అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
విక్రమ్ అన్ బిలవబుల్ యాక్టింగ్.. తను నటించే పాత్ర పట్ల ఉండే డెడికేషన్ ఇప్పటికే ఎన్నోసార్లు రుజువు అయింది. ఇక హీరో అంటే గ్లామర్ మాత్రమే కాదు డి గ్లామరస్ రోల్స్ అయినా.. కథలో కంటెంట్ ఉందనిపిస్తే ఎలాంటి కథనైనా నటించగలను అని చాలా సార్లు నిరూపించాడు విక్రమ్. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. అసలైన హీరోయిజం చూపించడానికి సిద్ధమయ్యాడు. అతను చేసే పనిలో హీరోయిజం ఉండాలని చెప్పే ప్రయత్నంగా తంగలాన్ సినిమాలో నటించాడు. ఇది విక్రమ్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందని సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అద్భుతమైన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఎక్స్ వేదికగా విక్రమ్ తంగలాన్‌లో.. తన నటనకు ప్రశంసల వర్షం కురుస్తుంది.
హ్యాష్‌ట్యాగ్ తంగలాన్ అంటూ సినిమా బాగా ట్రెండ్ అవుతుంది. ఫ్యాన్స్‌తో పాటు.. సాధారణ ప్రేక్షకుల్లో కూడా విక్రమ్ ప్రశంసలు కురిపించారు. ఆయనకు ఓ సినిమా పట్ల ఉన్న డెడికేషన్, ప్రేమను ప్రస్తావిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక విక్రమ్ ముద్దుగా చియాన్ అని ఫ్యాన్స్ పిలుస్తూ ఉంటారు. ఇంత గొప్ప నటుడు ఎలా అయ్యాడు.. ఇక విక్రం ఇంత గొప్పగా ఎలా ఎదగలిగాడు.. అనే దానికి తంగలాన్ మంచి ఉదాహరణగా నిలవనుందట. ఇక ఈ సినిమాల తన పాత్ర కోసం విక్రమ్ ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎంత ప్రిపేర్ అయ్యాడో.. ఎంత శ్రమించాడో.. సినిమాను చూసిన ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందని చెబుతున్నారు.
కొన్ని డిజైన్ దీని గురించి మాట్లాడుతూ.. ప్రతి ప్రాజెక్టుకి విక్రమ్ డెడికేషన్ అద్భుతంగా ఉంటుంది. ఇంతలా ఎలా చేయగలడు.. ప్రతి సినిమాకు ఇంత కొత్తదనం ఎలా చూపిస్తున్నాడు.. అందరికీ ఇది అసలు సాధ్యం కాదు.. కేవలం విక్రమ్ వల్ల మాత్రమే ఇది అవుతుంది అంటూ విక్రంపై ప్రశంసలు వర్షం కురిపించాడు. ఆయన నటన అద్భుతం అని.. ఇక మాళవిక డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. డి గ్లామర్ రోల్‌లో ప్రేక్షకులను మెప్పిస్తుంది అంటూ ట్విట్ చేశారు. అలాగే మరి కొంత మంది నెటిజన్స్ ఫస్ట్ హాఫ్ సినిమాలో విక్రమ్ నటన వేరే లెవెల్ లో ఉందని.. మాళవిక నటన కూడా అద్భుతంగా ఉందంటూ.. సెకండ్ హాఫ్‌లో ఈయన బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందంటూ వివరించారు. ఫైట్ సీన్స్ అయితే స్క్రీన్ ను షేక్ చేసే విధంగా ఉన్నాయట. అంతేకాదు జీవి ప్రకాష్ మ్యూజిక్, సెంటిమెంట్ సీన్స్ లో బిజిఎం, కంటెంట్ ఆడియన్స్‌ను మరింత కనెక్ట్ చేస్తున్నాయని చెప్తున్నారు.
ఇక అందరిలోనూ తమిళ్ ఆడియన్స్‌కి సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. వారికి విక్రమ్ పాత్ర భారీ లెవెల్లో ఆకట్టుకుంది. ఈ క్రమంలో తమిళ్‌లో సినిమా బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరించే టాలీవుడ్ ఆడియన్స్ ఇక ఈ సినిమా విషయంలో ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారో.. వేచి చూడాలి. ఇక సినిమా అసలుసిసలు హైలెట్ ఏంటంటే వివాదాస్పద క్రిటిక్ ఉమెర్ సంధు కూడా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇవ్వడమే. తమిళ్ ఆడియన్స్ లవ్ లో పడిపోయే విధంగా ఈ సినిమా స్టోరీ ఉందని.. విక్రమ్ నటన టెర్రఫిక్ అంటూ ఉమైర్ సంధు చెప్పుకొచ్చాడు.