మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ రివ్యూ… ర‌వితేజ ర‌ప్ఫాడించాడా.. హ‌రీష్ చించేశాడా..?

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బాక్సాఫీస్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే హీరోయి..న్గా జగపతిబాబు విల‌న్‌పాత్రలో నటించిన మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మిస్టర్ బచ్చన్ హంగామా తెరపై ఏ రేంజ్ లో సాగిందో.. ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం.

దేశ చరిత్రలో ఆదాయపన్ను శాఖ చేసిన ఓ అతిపెద్ద రైడా ఆధారంగా బాలీవుడ్ లో మొదట రైడ్ సినిమా వ‌చ్చింది. ఇక హరీష్ శంకర్ ఇదే క‌థ‌ను తనదైన స్టైల్ లో మార్పులు, చేర్పులు చేసి రవితేజతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. ఇక అసలు సినిమాతో పోల్చితే హరీష్ శంకర్ చేసిన అతి పెద్ద మార్పు.. ఈ సినిమాలో లవ్ ట్రాక్ ని పెట్టడమే. ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ కోసం అవసరానికి తగిన విధంగానే ఈ ప్రేమ కథ సినిమాలో జోడించాడు. ఇక సినిమాలో బ‌చ్చ‌న్(రవితేజ) దమ్ము, ధైర్యం, నిజాయితీ గల ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్. నమ్మిన విలువల కోసం అవసరమైతే దేశ ప్రధానినే కాదు.. ఇంకెవరినైనా కూడా ఎదిరించే సత్తా ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడు. ఓ అవినీతిపరుడైన పొగాకు వ్యాపారి ఇంటి పై రైడ్ చేసి మొత్తం బ్లాక్‌మనీ అంతా పట్టేసుకుంటాడు. కానీ పై అధికారులు బచన్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడం.. దీంతో పొంతూరు కోటపల్లికి వచ్చేసిన బచ్చన్ ఆర్కెస్ట్రా ట్రూప్ పెట్టుకొని అక్కడే లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు.

అక్కడే జిక్కి (భాగ్యశ్రీ)ని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ జరుగుతుంది. మొదట జిక్కి.. బచ్చన్ ను ప్రేమించకపోయినా తర్వాత అతని మంచితనం చూసి ఆమె కూడా రవితేజ పై మనసు పారేసుకుంటుంది. వీళ్ళ ప్రేమను పెద్దలు అంగీకరించడంతో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతారు. ఈ క్రమంలో మళ్లీ బ‌చ్చన్‌ ఉద్యోగంలో చేరమని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వస్తుంది. దీంతో ఓ వైపు పెళ్లి.. మరో వైపు డ్యూటీలో భాగంగా ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతిబాబు) ఇంట్లో రైడ్ చేయాల్సిన పరిస్థితి. ఇంతకీ జగ్గయ్య ఎవరు.. ఆయన అరాచకాలను రవితేజ ఎలా ఎదుర్కొన్నాడు.. అతని ఇంటిపై తన ఎలా రైడ్‌ చేశాడు ఈ క్రమంలో.. ఆయన ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు. బచ్చన్, జిక్కిల‌ పెళ్లి సుఖాంతం అయ్యిందా.. లేదా.. అనేది కథ. హరీష్ శంకర్ తన సొంత తెలివితో కొత్తగా లవ్ ట్రాక్ ను క్రియేట్ చేసినా ఇది ప్రధాన పాత్ర పోషించింది. అచ్చమైన అసలు సిసలు మాస్ కథ‌. ఇందులో మరి ఆశ్చర్యపరిచేంత కొత్తదనం కనిపించకపోయినా.. హీరో ఇంట్రాక్షన్ సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించింది.

ఫైట్ సీన్ తో తెరపై వాలిన మాస్ మహారాజ్.. వెంటనే పెళ్లిచూపులు, పొగాకు వ్యాపారి అక్రమ ఆస్తులు బయటపెట్టడం ఇలా హీరో క్య‌పాసిటి ఆసక్తికరంగా తరకెక్కించాడు హరిష్‌ శంకర్. మిస్టర్ బచ్చన్ పేరు వెనుకున్న కథ.. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక బచ్చన్ సస్పెండ్ అయ్యి కోటిపల్లి కి వెళ్ళిన తర్వాత రొమాంటిక్ కోణంలోకి కథ మలుపు తిరిగింది. ఓల్డ్ హిందీ క్లాసికల్ సాంగ్స్ ముడిపెట్టి హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్ ను నడిపిన తీరు వాళ్ళ మధ్య నడిచే క్యాసెట్స్ ప్రేమ రాయబారాలు ప్రేక్షకులని పాత రోజులకు తీసుకువెళ్తాయి. దీనికి తోడు మధ్యలో దొరబాబుగా(సత్య) చేసి అల్లరి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కరెక్ట్‌గా ఇంటర్వెల్ సీన్‌కు ముందు.. ముత్యం జగ్గయ్య ఇంటికి రైడ్‌కి వెళ్లడం.. ఆ తర్వాత అక్కడ బచ్చన్ చేసే యాక్షన్ సీన్స్.. కథపై మరింత ఆసక్తి పెంచుతాయి. అయితే ఫస్ట్ హాఫ్‌లో కనిపించిన హరీష్.. మార్క్ ఎంటర్టైన్మెంట్, మ్యాజిక్ సెకండ్ హాఫ్ లో అంతగా కనిపించలేదు.

ఇది పూర్తిగా ఐటి రైట్ నేపథ్యంలో తెర‌కెక్కిన కథ అన్న సంగతి తెలిసిందే. దీంతో సెకెండ్ హాఫ్‌ ఆసక్తికరంగా సాగాలంటే.. కనీసం రైడ్ సాగే టైంలో కొన్నైనా అడ్వెంచర్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. హీరో బుర్రకు పదును పెట్టి.. విలన్‌ను చేదించాల్సి ఉంటుంది. అలా సినిమాను తెరకెక్కించి ఉంటే సినిమా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకునేది. అయితే ప్రతి నాయకుడిగా అక్రమార్జాన‌ను.. తవ్వి తీసే ప్రక్రియలో హీరో బుర్రకు ప‌దునుపెట్టే సంఘటనలు కానీ.. బచ్చన్ కు ఎలాంటి సవాళ్లు ఎదురవడం కానీ.. చూపించలేదు. ప్రారంభంలో మాత్రం కరుడుగట్టిన విలన్ గా జగపతిబాబును చూపించిన తర్వాత మాత్రం.. ఆ ఎఫెక్ట్ సినిమాలో కనిపించకపోవడం.. సినిమా కథపై సంఘర్షణ తగ్గింది. మధ్యలో సిద్దు జొన్నలగడ్డ యాక్షన్స్ సీక్వెన్స్ సినిమాకు కాస్త హైప్. ఇక సాధారణ క్లైమాక్స్ తోనే సినిమా ముగిసింది.

జగపతిబాబు క్యారెక్టర్ స్టార్టింగ్ లో పవర్ ఫుల్ గా చూపించిన తర్వాత పూర్తిగా వీక్ గా మారింది. సత్య కామెడీ ఫస్ట్ అఫ్ లో సినిమాకి హైలెట్‌. తనికెళ్ల భరణి, సచిన్‌ఖేడ్క‌ర్, గౌతమి, అన్నపూర్ణమ్మ తదితరులు తమ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సిద్దు జనులగడ్డ స్క్రీన్ పై కనిపించిన కొద్దిసేపు ప్రేక్షకులు వేరే లెవెల్ మెప్పించాడు. ఇక ఈ సినిమాలో ఓ పాటకు దేవిశ్రీప్రసాద్ కూడా తలుక్కున్న మెరుస్తాడు. హరీష్ శంకర్ కథలో చేసిన మార్పులు చేర్పులు ఆయన రాసుకున్న సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఫస్ట్ ఆఫ్లో బలమైన కథ లేకున్నా.. లవ్ ట్రాక్, కామెడీ సీన్స్ ప్రేక్షకులను మెప్పించాయి. అసలు కథలోకి వెళ్ళాక పూర్తిగా స్టోరీ వీకైనట్లుగా అనిపించింది. ఇక సాంకేతిక పరంగా మిక్కీ జే మేయర్.. కథకు తగ్గట్టుగా మంచి క్యాచీ ట్యూన్స్ ఇచ్చి మెయున్ హీరో అయ్యిపోయాడు. రెప్పల్ డప్పుల్‌, చెక్కి, సితార, నల్లంచు తెల్లచీర పాటలు, మరోవైపు ఈ పాటల డ్యాన్స్ స్టెప్స్ కూడా కన్నుల విందు చేశాయి. సినిమా నిర్మాణ విలువ‌లు, క్వాలిటీ సినీ మాటోగ్ర‌ఫీ బాగున్న సెకండ్ హాఫ్ లో కథ వీక్ గా ఉండడం సినిమాకు కాస్త మైనస్ అయిందని చెప్పాలి.