ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో.. రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అత్యధిక కలెక్షన్ల సాధించిన టాప్ 10 సినిమాలు ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
గిల్లి :
విజయ్ దళపతి, త్రిష జంటగా నటించిన తమిళ్ మూవీ గిల్లి.. కొద్దిరోజుల క్రితం థియేటర్స్‌లో రీ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏకంగా రూ.32.5 కోట్ల గ్రాస్ వసూళను కొల్లగొట్టి.. రీ రిలీజ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.
మురారి:
మహేష్ బాబు – సోనాలి బింద్రే జంటగా నటించిన.. కృష్ణవంశీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా థియేటర్స్ లో రీ రిలీజ్ అయ్యి రూ.8.31 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి రికార్డ్ సృష్టించింది.
ఖుషి:
పవన్ కళ్యాణ్ – భూమిక జంటగా నటించిన ఈ సినిమా.. గతేడాది థియేటర్లలో రీ రిలీజ్ అయ్యి రూ.7.5 కోట్ల వసూళ్లను సాధించింది.
బిజినెస్‌మెన్:
మహేష్ బాబు, కాజల్ జంటగా నటించిన మూవీ బిజినెస్‌మాన్. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. ఇటీవల రీరిలీజై.. రూ. 5.8 కోట్లు కొల్లగొట్టింది.
స్పదికం:
మోహన్‌లాల్ – తిలకమ్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మూవీ స్పదికం. రీ రిలీజ్‌లో రూ.4.90 కోట్లు సాధించింది.
సింహాద్రి:
జూనియర్ ఎన్టీఆర్ – భూమిక జంటగా నటించిన మూవీ సింహాద్రి. కొద్దికాలం క్రితం రీరిలీజ్ అయిన ఈ మూవీ రూ.4.6 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
ఈ నగరానికి ఏమైంది:
తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా కొంతకాలం క్రితం రీ రిలీజ్ అయింది. రూ. 3.50 కోట్ల వసూళ్లు సాధించింది.
సూర్య సన్ ఆఫ్ కృష్ణన్:
గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్‌లో.. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా.. రీరిలీజ్‌లో రూ.3.35 కోట్ల వసూళ్లను సాధించింది.
ఆరెంజ్ :
రామ్ చరణ్ – జెనీలియా జంటగా నటించిన ఆరెంజ్ మూవీ.. రీ రిలీజై.. రూ.3.20 కోట్ల కలెక్షన్లు సాధించింది.
జల్సా:
పవన్ కళ్యాణ్ – గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటించిన మూవీ జల్సా కూడా.. రి రిలీజ్ అయి రూ.3.10 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టింది.
ఒక్కడు :
మహేష్ బాబు – భూమిక జంటగా నటించిన ఒక్కడు మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా థియేటర్లలో రీ రిలీజ్ అయి రూ.2.5 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది.