వివాదాల్లో నందమూరి ఫ్యామిలీ.. రెండుగా చీలనుందా.. కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే దానికి మూల కారణంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్. చెన్నైలో ఉండిపోకుండా.. తెలుగు పరిశ్రమ ప్రత్యేకంగా వెలుగువెలగాలని ఉద్దేశంతో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎంతో కష్టపడి మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు టాలీవుడ్ ఇండస్ట్రీని తరలించారు. ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. కెరీర్ పరంగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస‌ హ్యాట్రిక్లతో ప్రస్తుతం తన 109వ సినిమాలను నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు బాలయ్య. బాబి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఎన్టీఆర్ మొదటి తరం, రెండో తరం బాలయ్య హీరోలుగా కొనసాగగా.. మూడో త‌రం హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రాణిస్తున్నారు.

Nandamuri Balakrishna's Son Mokshagna Teja To Debut Under Prasanth Varma:  Reports - News18

అయితే తారక్‌ పరిశ్రమంలోకి అడుగుపెట్టి ఇప్పటికే 25 సంవత్సరాలు పూర్తయింది. ఇక ఎన్టీఆర్ కెరీర్‌ స్టార్టింగ్‌లో తెలుగుదేశం పార్టీ ఆయనను భుజానికెత్తింది. కాలక్ర‌మేణా విభేదాల కారణంగా.. టిడిపికి, తెలుగుదేశం కార్యకర్తలకు ఎన్టీఆర్ దూరం వచ్చేసారు. ఇటీవల చంద్రబాబు జైల్లో ఉన్న టైంలో కూడా ఎన్టీఆర్ అసలు రియాక్ట్ కాలేదు. దానికి తోడు చంద్రబాబు, బాలయ్య, లోకేష్ పై తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నా కొడాలి నాని, వల్లభనేని వంశీల విషయంలో కూడా ఎన్టీఆర్ చాలా కామ్ గా ఉండిపోవడంతో.. టిడిపిలో ఎన్టీఆర్ పై తీవ్ర తిరుగుబాటు మొదలైంది. ప్రస్తుతానికి టిడిపి పార్టీ శ్రేణులు అంతా బాలయ్య వైపే మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలయ్య వారసుడుగా మోక్షజ్ఞ ఇంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

NKR 16: Jr NTR launches Nandamuri Kalyan Ram, Shalini Pandey's film

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియాలో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కు మోక్షజ్ఞ మొదటి సినిమా బాధ్యతలు అప్పచెప్పాడు బాలయ్య. ఈ సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంటే మాత్రం ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు.. నందమూరి అభిమానులంతా కూడా బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞని భుజానికి ఎత్తుకుంటారని.. తారక్‌ను దూరం పెడతారని కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో ఇతర సభ్యులతో తారక్, కళ్యాణ్ రామ్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ అడుగుపెడితే ఎన్టీఆర్‌కు ఇప్పుడు ఉన్న కాస్తో కూస్తో టిడిపి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తగ్గిపోతుందనే కామెంట్లు వెలువవుతున్నాయి. హీరోగా మోక్షజ్ఞ విజయం దక్కించుకుంటే మాత్రం టిడిపి శ్రేణులు తారక్‌కు చెక్ పెడతాయని.. విశ్లేషకులు చెప్తున్నారు. ఇలా త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ కారణంగా నందమూరి ఫ్యామిలీ రెండుగా చీలిపోనుందని కామెంట్లు నెటింట‌ చర్చనియంశంగా మారాయి.