టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది రామ్ గోపాల్ వర్మ. అయితే రామ్ గోపాల్ వర్మ కు ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి, జయసుధ అన్న సంగతి దాదాపు టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలుసు. రామ్‌గోపాల్ వర్మ ఫేవరెట్ హీరోయిన్స్ అంటూ వీరిద్దరి పేర్లు ఎప్పటికప్పుడు నెటింట వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే అప్పట్లో శ్రీదేవి కోసం ఆర్జీవి స్టార్ డైరెక్టర్‌ను చంపాలని భావించారట. అయితే శ్రీదేవి కోసం ఆ డైరెక్టర్ ను ఎందుకు చంపాలి అనుకున్నారో.. అసలేం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఆర్జీవి చంపాలనుకున్న ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావుకి శ్రీదేవి అంటే ఎంత పిచ్చి ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆమె చనిపోయినా.. ఇప్పటికి ఆరాధ్య దేవతగా కొలుస్తున్న ఆర్జీవి.. దర్శకేంద్రుడు సౌందర్యలహరి ప్రోగ్రాం లో శ్రీదేవితో కలిసి సందడి చేశాడు. ఆ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావుకి, శ్రీదేవికి మధ్యన రిలేషన్ బయటపడిందట. అయితే రాఘవేంద్రరావు దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం కాకుండానే.. ఆయన తండ్రి పెద్ద డైరెక్టర్. అలా ఓ రోజు రాఘవేంద్రరావు తండ్రి డైరెక్షన్‌లో శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఓ సినిమాలో నటించిందట. ఇక ఈ మూవీ షూట్ టైంలో తండ్రి లేకపోవడంతో శ్రీదేవి మీద ఆయనే ఓ షాట్ తెరకెక్కించాలని భావించాడట. అలా రోడ్డు మీద శ్రీదేవిని పరిగెత్తుకుంటూ రమ్మని.. షాట్ రెడీ చేశాడట. ఇక అదే టైంలో రోడ్ పై ఓ కార్ రావడం.. శ్రీదేవిని ఆ కార్ తాకడంతో శ్రీదేవి సడన్గా స్పృహతప్పి పడిపోయారట.
అయితే ఆరోజు శ్రీదేవికి పెద్ద ప్రమాదం తప్పిందని.. ఆ కారు కాస్త ఎక్కువ స్పీడ్ తో గుద్దితే మాత్రం శ్రీదేవి ప్రాణాలు పోయావని ఈ షోలో రాఘవేంద్రరావు రివీల్ చేశారు. ఇక ఈ విషయం రాఘవేందర్రావు తండ్రికి తెలిసి.. ఆయనపై ఫుల్ ఫైర్ అయ్యారట. అయితే విషయాన్ని శ్రీదేవితో ఆర్జీవితో రాఘవేంద్రరావు చెబుతున్న టైం లో.. శ్రీదేవికి ఏమైనా అయ్యి ఉంటే నేను మిమ్మల్ని కచ్చితంగా చంపేసే వాడిని అంటూ రాఘవేంద్రరావుకు ఆర్జీవి లైవ్ లోనే వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వార్నింగ్ ఆర్జీవి రాఘవేంద్రరావు ఫుల్ ఫన్నీ వేల్లో చెప్పుకొచ్చారు. ఇక అప్పటి ఓల్డ్ వీడియో ప్రస్తుతం నటించటం మరోసారి వైరల్ గా మారింది.