దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి.. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి దాదాపు ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది. ఆమె మరణించి ఇన్ని సంవత్సరాలు పూర్తయినా.. శ్రీదేవికి మాత్రం లక్షలాదిమంది అభిమానులకు హృదయాల్లో గూడుకట్టి మరీ చెరగని ముద్ర వేసుకున్నారు. 1963 మే 13న జన్మించిన శ్రీదేవి.. మరణించినప్పటికీ ఇంకా ఆమె అభిమానులు శ్రీదేవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. అలాంటి ఈ అమ్మడికి బ్రతికున్న టైంలో ఓ కోరిక ఉండేదట. అయితే మరణించడంతో అది తీరకుండానే ఉండిపోయింది. ఇంతకీ శ్రీదేవికి ఉన్న ఆ తీరని కోరిక ఏంటి.. అనుకుంటున్నారా.
ఆమెకు బ్లాక్ బస్టర్ మూవీ అయినా దేవదాసు సినిమాలో పార్వతి పాత్రలో.. అయినా లేదా లైలా మజ్ను మూవీలో లైలా పాత్రలో అయినా నటించాలని కోరిక ఎప్పటినుంచో ఉండేదట. అయితే ఆమె బ్రతికున్నంత సమయంలో ఆమె దగ్గరకు అలాంటి పాత్రలు ఏవి రాలేదని.. అలాంటి పాత్ర వచ్చి ఉంటే కచ్చితంగా ఆమె నటించేదని.. ఇదే తన కోరిక అంటూ గతంలో శ్రీదేవి ఇంటర్వ్యూలో వివరించింది. అలాగే శ్రీదేవి తన చేతులారా వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఉందని.. భారతి రాజు డైరెక్షన్లో వచ్చిన కిల్లెక్కి పోగు రైలు.. కాగా ఈ సినిమా తెరకెక్కించే టైంలో హీరోయిన్గా మొదటి అవకాశం తనకే వచ్చిందట. అయితే పాత్ర నచ్చి ఒప్పుకున్నా.. సినిమా 20 రోజులపాటు అవుట్డోర్ షూటింగ్ కావడంతో.. అప్పటికే వేరే సినిమాకు కమిట్మెంట్స్ ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక.. ఆ సినిమాను తను మిస్ చేసుకోవాల్సి వచ్చిందని వివరించింది.
అయితే ఆ సినిమా వదులుకున్నందుకు మొదట్లో బాధపడినా.. తాను ఆ సినిమాలో నటించనందుకు మరో నటికి ఆ సినిమా ద్వారా అవకాశం వచ్చి.. స్టార్ హీరోయిన్ అయిందని ఆనందపడేదట. ఇంతకీ ఆ మరో హీరోయిన్ ఎవరో కాదు రాధిక. శ్రీదేవి సినిమా రిజెక్ట్ చేయడంతో రాధిక ఈ సినిమాలో హీరోయిన్గా నటించి మంచి సక్సెస్ అందుకుంది. అలా శ్రీదేవి ఇండస్ట్రీలో ఉన్నని రోజులు తను మాత్రమే కాదు.. తనతో పాటు అందరూ ఎదగాలని.. మంచి మనసుతో ఉండేది. అయితే ఇంత మంచి మనసున్న శ్రీదేవి కేవలం 54 ఏళ్ళ వయసులోనే మరణించడం బాధాకరం. అలా ఆమె నటించాలనుకున్న లైలా, పార్వతి పాత్రల్లో నటించాలని కోరిక తీరకముందే మరణించింది. ఇకపై ఆ కోరిక తీరే వీలు కూడా లేదు.