సినీ ఇండస్ట్రీలో మొదట ఓ హీరోతో అనుకొన్న కథలను మరో హీరోతో తెరకెక్కించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గతంలో ఎంతో మందికి బాగా నచ్చిన.. అందరూ మెచ్చిన కథను జూనియర్ ఎన్టీఆర్‌కు ఓ డైరెక్టర్ వినిపించగా.. ఎన్టీఆర్ ఆ సినిమాను రిజెక్ట్ చేశాడని వార్త వైరల్‌గా మారుతుంది. దర్శకుడుగా కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. బుచ్చిబాబుకు తిరుగులేని ఇమేజ్ ని క్రియేట్ చేసి పెట్టింది. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు.. జూనియర్ ఎన్టీఆర్ తో స్పోర్ట్స్ సినిమా తెరకెక్కించబోతున్నాడు. అయితే కొంతకాలం జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఈ సినిమాలు తారక్ రిజెక్ట్ చేశాడట. దీంతో ఇదే కథని బుచ్చిబాబు చరణ్ కు వినిపించాడట.
చరణ్ కు కథ బాగా నచ్చడంతో చరణ్ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. అదే ఆర్సి16 అంటూ వార్తలు అనిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని మరికొద్ది రోజుల్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ కు సిద్ధమవుతున్నారు మేకర్స్. ఇక జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతోనే బుచ్చిబాబు సినిమా తీస్తున్నాడని.. చరణ్ ఈ సినిమాలో నటించబోతున్నాడని.. ఇక ఈ కథను గతంలోనే రామ్ చరణ్‌తో సహా ఎంతోమంది విని కథ చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు అంటూ.. ఇక సినిమాలో ఓ ప్రధానోపాత్రలో నటించబోయే శివరాజ్ కుమార్ పాత్రను కూడా బుచ్చిబాబు కథలో అద్భుతంగా చూపించబోతున్నాడు అంటూ తెలుస్తుంది.
సినిమా ఖచ్చితంగా బ్లాక్ పాస్టర్ అవుతుందని.. ఇప్పటివరకు కథ విన్న ఎంతోమంది వివరించారట. ఇక విజయసేతుపతి కూడా గతంలో బుచ్చిబాబు.. చరణ్‌తో తెరకెక్కించబోయే మూవీ స్టోరీ నాకు తెలుసు.. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని కామెంట్ చేశారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా ఈ సినిమాకు సంగీతం అందించడానికి ఎంతో ఆసక్తి చెబుతున్నట్లు వివరించారు. ఇలా ఎంతోమందికి ఈ సినిమా కథ నచ్చిన ఎన్టీఆర్కు మాత్రం ఎందుకు నచ్చలేదు అనే సందేహం కొంతమందిలో మొదలైంది. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ని బట్టి ఎన్టీఆర్ ఎందుకు ఈ సినిమాను రిజెక్ట్ చేశాడో తెలిసే అవకాశం ఉంది.