బాధలో ఉన్న సమంతకు.. అక్కినేని ఫ్యామిలీ బిగ్ గుడ్ న్యూస్..!

అక్కినేని నటవారుసడిగా నాగార్జున తనయుడు నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. జోష్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చైతన్య తర్వాత తెర‌కెక్కిన ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాతో చైతన్యతో పాటు సమంతకు కూడా మంచి ఇమేజ్ వచ్చింది. హీరోయిన్గా ఈ సినిమా తర్వాత అమ్మడికి వరుస‌ అవకాశాలు క్యూ కట్టడంతో.. స్టార్ హీరోయిన్గా మారిపోయింది. కాగా నాగచైతన్య, సమంత ఈ సినిమా షూట్ టైంలోనే ఒకరితో ఒకరు ప్రేమలో పడటం.. కొన్ని రోజుల రహ‌స్య‌ ప్రేమాయ‌ణం తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకోవడం అందరికీ తెలుసు. వీరిద్దరు పెళ్లి తర్వాత ఎంతో కాలం అన్యోన్యంగా ఉన్న ఈ జంట.. ఏవో మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. ఇక వీరిద్దరు విడాకుల తర్వాత ఇటు సమంతకు, అటూ నాగచైతన్యకు ఇద్దరికి సినిమాలపరంగా అసలు కలిసి రావడం లేదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక ప్రస్తుతం నాగచైతన్య.. తండేల్‌ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు. ఇక సమంత కూడా తన కెరీర్‌లో సినిమాల పరంగా బిజీగా గడుపుతుంది. కాగా తాజాగా నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. ఈ విషయాన్ని నాగార్జున తన సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన సంగతి తెలిసిందే. శోభితతో మా కుటుంబం చాలా సంతోషంగా ఉంటుందని.. సమంతతో విడాకుల తర్వాత చైతు కృంగిపోయాడని.. ఎవరితో తన బాధను షేర్ చేసుకోలేదంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని తెలిసిన తర్వాత సమంత కాస్త బాధపడినట్లు టాక్. ఇక వివాహానికి ముందు నాగచైతన్య కంటే సమంతకే ఎక్కువగా స్టార్‌డం క్రియేట్ అయింది. అమ్మడితో సినిమాల్లో నటించడానికి స్టార్ హీరోలు కూడా ఎంతో ఆసక్తి చూపేవారు. అయితే చైతన్యతో వివాహం తర్వాత సమంత పెద్ద ఇంటి కోడలు కావడంతో.. కాస్త బోల్డ్, రొమాంటిక్ సినిమాలను చేయడానికి సమాంతను అప్రోచ్ అవ్వాలంటే సినీ డైరెక్టర్లతో పాటు.. స్టార్ హీరోలు కూడా ఆలోచించేవారట.

అయితే సమంత.. నాగచైతన్యకు డివోర్స్ తర్వాత కూడా ఇలాంటి సన్నివేశాలలో సమంతను అప్రోచ్ అయితే అందరూ ఏమనుకుంటారో అనే భావన దర్శకుల్లో ఉండేదని.. కాగా ప్రస్తుతం నాగచైతన్య రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధమైపోయారు. శోభితతో.. నాగచైతన్య వివాహం కానుంది. ఈ క్రమంలో సమంత ఎలాంటి సన్నివేశాల్లో నటించిన ఈ రొమాంటిక్ సీన్స్, బోల్డ్‌ సీన్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆమెను అడిగేవారు ఎవరు ఉండరు. ఇక వీరిద్దరి ఎంగేజ్మెంట్‌తో సమంతకు తన సినిమాలు విషయంలో ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసి నట్లే.. తన కెరీర్లో తను హ్యాపీగా ఉండవచ్చు.. తనకు నచ్చిన పాత్రలను ఎంచుకుని నటించవచ్చు.. అంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలా నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ కూడా సమంతకు మంచి గుడ్ న్యూస్ అంటూ సమంతపై కామెంట్స్‌ చేస్తున్నారు.