మహేష్‌బాబును నిండా ముంచేసిన డైరెక్ట‌ర్లు వీళ్లే…!

టాలీవుడ్ సూపర్ స్టార్‌గా మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను దక్కించుకుంటూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న ఈయన.. నాలుగు పదుల వయసులోనూ తన ఫిట్నెస్, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇప్పటి వరకు మహేష్ తన సినీ కెరీర్‌లో ఓసారి హిట్‌ ఇచ్చిన దర్శకులపై నమ్మకంతో.. రెండోసారి అవకాశం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే చాలా సందర్భాల్లో మహేష్ తనకు హిట్ ఇచ్చిన దర్శకులను నమ్మి మరోసారి అవకాశం ఇస్తే.. వారు మ‌హేష్‌ను ముంచేశారు. ఆ డైరెక్ట‌ర్‌లు ఎవరో ఒకసారి చూద్దాం.

గుణశేఖర్:
మహేష్ బాబు తన కెరీర్ స్టార్టింగ్‌లో ఒక్కడు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో.. గుణశేఖర్ హార్డ్ వర్క్ నచ్చిన మహేష్ బాబు.. అతనికి తర్వాత రెండు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడు. సైనికుడు, అర్జున్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ సినిమాల్లో నటించాడు. కానీ గుణశేఖర్ ఈ రెండు సినిమాలతోనూ ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయాడు

శీను వైట్ల :
మహేష్ కొద్దిగా కాలం క్రితం శ్రీను వైట్ల డైరెక్షన్లో దూకుడు సినిమా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో శీను వైట్లతో.. మహేష్ బాబు ఆగడు సినిమాలో నటించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

శ్రీకాంత్ అడ్డాల :
మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో వెంకటేష్‌తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మల్టీ స్టార‌ర్ సినిమా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. దీంతో శ్రీకాంత్‌కు మహేష్ మరో అవకాశం ఇచ్చాడు. అయితే శ్రీకాంత్ అడ్డాల ఈసారి మహేష్ తో బ్రహ్మోత్సవం సినిమాను రూపొందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరాతి ఘోరంగా బోల్తా పడింది. ఇలా మహేష్ తనకు గతంలో ఓ మంచి హిట్ ఇచ్చారన్న నమ్మకంతో.. దర్శకులకు రెండో అవకాశం ఇస్తే వారు ఆ నమ్మకాన్ని వమ్ము చేసారు.