టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో సురేంద్ర రెడ్డి ఒకడు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అతనొక్కడే సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన సురేందర్ రెడ్డి.. అద్భుతమైన మాస్, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. అతనొక్కడే సినిమాను తెరకెక్కించిన ఈయన.. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే ఈ డైరెక్టర్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో అశోక్ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. అయితే తర్వాత సురేందర్ రెడ్డి కొంతకాలానికి కిక్ కథను రవితేజతో తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా.. గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి సురేందర్ రెడ్డి కి మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈ సినిమాకు వక్కాంతం వంశీ కథను అందించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి ఈ సినిమాను మొదట జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించాలని భావించాడట. అందులో భాగంగానే సురేందర్ రెడ్డి ఎన్టీఆర్‌ను కలిసి సినిమా కథను వివరించాడట.
అయితే ఆ కథ మొత్తం విన్న ఎన్టీఆర్.. కథ బాగానే ఉంది కానీ.. నాపై ఈ కథ వర్కౌట్ కాదంటూ సురేందర్ రెడ్డి తో తన అనుమానాన్ని వ్యక్తం చేశాడట. ఇక ఈ సినిమా కంటే ముందు సురేందర్ రెడ్డి, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన అశోక్ సినిమా ఫ్లాప్ అవడం కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సురేందర్ రెడ్డి సినిమాను రిజెక్ట్ చేయడానికి ఒక కారణమని టాక్. అప్పటికే అశోక్ ఫ్టాప్ కావడంతో.. మరోసారి వీరిద్దరు కాంబోలో సినిమా అంటే.. జనాలు అసలు సినిమాకు వస్తారో.. లేదో.. సినిమా సక్సెస్ అందుకుంటుందో.. లేదో.. అనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ కథను రిజెక్ట్ చేశాడట. అలా కేవలం ఒక ఫ్లాప్ సురేంద్ర రెడ్డి.. తారక్‌తో సినిమా చేసే అవకాశాని చేజారిపోయేలా చేసింది. దీంతో సురేందర్ రెడ్డి ఆ కథను రవితేజతో తెరకెక్కించి కిక్ రూపంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు.