ఇండస్ట్రీలో నటవారసులుగా ఎంతోమంది అడుగుపెట్టి రాణిస్తున్న సంఘటనలు ఉన్నాయి. అయితే వారసులుగా ఇంట్రీ ఇవ్వడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని చాలామంది భావిస్తారు. కానీ.. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఏ రంగంలో ఆయినా అనుకున్నంత సులభంగా వారసత్వాన్ని నిలబెట్టుకోలేరు. అలా పైన కనిపిస్తున్న ఈ పిల్లాడు కూడా తండ్రి పేరుతో సినిమాల్లోకి వచ్చిన.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాల్లో నటించి పాన్ ఇండియన్ స్టార్ గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
అయితే ఇంతలా చెబుతున్నా ఈ తండ్రి, కొడుకు ఎవరో ఇప్పటికైనా మీరు గుర్తుపట్టారా.. వాళ్ళు మరెవరో కాదు దుల్కర్ సల్మాన్, తండ్రి మమ్ముట్టి.. సీతారామం, మహానటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్.. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్న కుర్రాడు. ఇక ఈయన తండ్రి మమ్ముట్టి మలయాళం లో మెగా స్టార్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తండ్రి స్టార్ హీరో కావడంతో దుల్కర్ సల్మాన్ ఇండస్ట్రీలోకి సులభంగానే వచ్చేసినా.. స్టార్ హీరో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడానికి మాత్రం ఎంతో కష్టపడ్డాడు.
ఈ క్రమంలో ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ పోజిషన్‌కు చేరుకున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న దల్కర్ సల్మాన్.. సొంత భాష మలయాళంలో ఎన్నో సినిమాల్లో మెప్పించాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. తమిళ్, హిందీలో ఇప్పటికే హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. పేరుకే తండ్రి, కొడుకులు అయినా మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ ఒకరిని మించి ఒకరు దేశవ్యాప్తంగా ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు.