హీరోయిన్ శోభిత ధూళిపాల.. నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత.. ఒక్కసారిగా వార్తలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అక్కినేని కుటుంబానికి కోడలు కానున్న క్రమంలో.. ఈ అమ్మడుకు సంబంధించిన ప్రతి చిన్న వార్త, గతంలో అమ్మడు క్రియేట్ చేసిన రికార్డ్స్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇలా ప్రతి ఒక్కటి నెటింట వైరల్ గా మారుతుంది. శోభిత ఇప్పటికే హీరోయిన్గా పలు సినిమాలో నటించినా.. తెలుగు తో పాటు తమిళ, హిందీ భాషల్లోను ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. స్టార్ హీరోయిన్గా అయితే ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోయింది.
అయితే ప్రస్తుతం అక్కినేని హీరో భార్యగా అడుగుపెడుతుండడంతో.. సినిమాల కంటే ఎక్కువగా క్రేజ్ సంపాదించుకుంది. ఇక గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. వాటన్నిటిని నిజం చేస్తూ గత వారం ఎంగేజ్మెంట్ చేసుకుని అఫీషియల్ గా దీనిని ప్రకటించారు. సమంతతో విడాకులు తర్వాత నాగచైతన్య, శోభితను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వీరిద్దరి త్వరలో వివాహం చేసుకోనున్నారు. ఇక వీరిద్దరి నిశ్చితార్థానికి ఇరు కుటుంబసభ్యులతో పాటు.. పలువురు బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఇక వీరికి ఎంగేజ్మెంట్ తర్వాత అభిమానులు, పలువురు సెలబ్రిటీల అభినందనలు వెలువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా శోభిత పాత ఇన్‌స్టా పోస్ట్ ఒకటి నెటింట వైరల్‌గా మారింది. గతంలో ఆమె తన సోదరీ సమాంతను ఉద్దేశ్యిస్తూ చేసిన కామెంట్స్ నెటింట సంచలనం రేపుతున్నాయి. నా తల్లిదండ్రుల పట్ల నాకున్న ప్రేమను తెలియజేసేందుకు ఎన్ని జన్మలెత్తినా సరిపోదు.. మా నాన్న, అమ్మ నాకు ప్రతి జన్మలో తల్లిదండ్రులుగా కావాలని నా కోరిక అంటూ రాసుకొచ్చింది. ఇంకేమీ నాకు అవసరం లేదని.. నా సోదరి సమంత కుక్కల పుట్టిన పర్వాలేదంటూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు వామ్మో.. సమంతనే కుక్కల పుట్టిన పర్లేదని ఇన్ డైరెక్ట్‌గా శోభిత చెప్పిందంటూ పోస్టును ట్రెండ్ చేస్తున్నారు.
View this post on Instagram